సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images

మోకాలి మార్పిడి

పరిశీలన

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స – దీనిని మోకాలి ఆర్థ్రోప్లాస్టీ అని కూడా అంటారు, ఇది తీవ్రంగా వ్యాదిగ్రస్తమైన మోకాలి యొక్క కీళ్ళ నొప్పికి ఉపశమనo కలిగిస్తుంది మరియు వాటి పనితీరును సరిచేయుటలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో మీ తొడ ఎముక, చలానాస్థి మరియు మోకాలి చిప్ప నుండి పాడయిన ఎముక మరియు మృదులాస్థిని కట్ చేసి తొలగించడం మరియు దానిని లోహ మిశ్రమాలు, హై-గ్రేడ్ ప్లాస్టిక్స్ మరియు పాలిమర్లతో తయారు చేసిన కృత్రిమ జాయింట్ (ప్రొస్థెసిస్) తో రీప్లేస్ చేయడం జరుగుతుంది.

మోకాలి మార్పిడి మీకు అనుకూలిస్తుందా అనేది నిర్ణయించదానికి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ మీ మోకాలి యొక్క కదలిక పరిధి, స్థిరత్వం మరియు బలం బట్టి అంచనా వేస్తారు. మోకాలికి జరిగిన నష్టాన్ని నిర్ణయించడంలో X-రే సహాయపడుతుంది.

మీ వయస్సు, బరువు, కార్యాచరణ స్థాయి, మోకాలి పరిమాణం మరియు ఆకారం మరియు మొత్తం ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని మీ డాక్టర్ వివిధ రకాల మోకాలి మార్పిడి ప్రొస్థెసెస్ మరియు శస్త్రచికిత్సా పద్ధతుల నుండి ఎంచుకోవచ్చు.

ఎందువలన ఇది చేయబడుతుంది?

ఆర్థరైటిస్ అంటే కీళ్లలో కలిగే వాపు. ఎముకల చివరి భాగం యొక్క కణజాలంలో జరిగే క్రమమైన అరుగుదల వలన బహిర్గతమైన ఎముకల ఉపరితలాలపై అవి కలిసే చోట మరియు బహిర్గాతమైన ఎముక ఉపరితలాలపై రాపిడి జరిగి, ఎముక కదలికలో క్రమమైన మార్పులు మరియు తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది. ఈ పరిస్థితికి చికిత్స చేయడానికి మరియు మోకాలిలో సాధారణ కార్యకలాపాలను తిరిగి చేసుకొనేలా చేయడానికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అనేది ఉత్తమ పరిష్కారం.

కీళ్ళవాపు రకాలు:

ఆస్టియో ఆర్థరైటిస్

కీళ్లవాపు కలిగిన కుటుంబ చరిత్ర గల వ్యక్తులలో ఇది 50 సంవత్సరాల వయస్సు తరువాత కలుగుతుంది. మోకాలి ఎముకలకు మెత్త వలే పనిచేసే కణజాలం మృదువుగా మారుతుంది మరియు అరిగిపోతుంది. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి రుద్దుకొని, మోకాలిలో నొప్పి కలిగిస్తాయి మరియు బిరుసుగా మారుతాయి.

కీళ్ళవాతం వలన కలిగే కీళ్ళవాపు

ఇది కీళ్ళ లోపలి పొర మందంగా మరియు వాపుగా మారే ఒక వ్యాధి. దీనివల్ల ఈ కీళ్ళను జారుడుగా చేసే ద్రవ పదార్ధం అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఈ దీర్ఘకాలిక మంట ఎముకల చివరలను కప్పి ఉంచే కణజాలాన్ని పాడు చేస్తుంది మరియు చివరికి కణజాలo పాడయి నొప్పి మరియు బిరుసుదనానికి దారితీస్తుంది.

భావోద్వేగపూరిత కీళ్ళవాపు

ఇది మోకాలికి తగిలిన ఒక తీవ్రమైన గాయం వలన వస్తుంది. మోకాలి యొక్క సంధాయక కణజాలంలో ఏదైనా పగుళ్లు లేదా బాగా చీలిపోవడం అనేది కాలక్రమేణా ఎముకల చివరలను కప్పి ఉంచే కణజాలానికి నష్టం కలిగిస్తుంది, మోకాలికి నొప్పిని కలిగిస్తుంది మరియు మోకాలి పనితీరును పరిమితం చేస్తుంది.

వ్యాధి లక్షణాలు

  • జాయింట్లో కలిగే తీవ్రమైన నొప్పి వలన నడక, మెట్లు ఎక్కడం మరియు కుర్చీల నుండి లేవడం వంటి రోజువారీ కార్యకలాపాలకు అవరోధం కలిగించుట.
  • విశ్రాంతి తీసుకునేటప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుట.
  • మందులు మరియు విశ్రాంతి వలన మెరుగుపడని కీళ్ల వాపు మరియు మంటగా ఉండటం.
  • జాయింట్­లో గల వైకల్యం.
  • జాయింట్ బిరుసుదనం లేదా జాయింట్­ని సాధారణ రీతిలో కదిలించలేకపోవడం

మీరు ఈ చికిత్స కోసం ఎలా సిద్ధం అవుతారు

ఆహారం మరియు మందులు

శస్త్రచికిత్సకు ముందు కొన్ని మందులు మరియు ఆహార పదార్ధాలను తీసుకోవడం మానేయమని మీ వైద్యుడు లేదా అనస్థీషియాలజిస్ట్ మీకు సలహా ఇవ్వవచ్చు. శస్త్రచికిత్స జరిగిన రోజు అర్ధరాత్రి తరువాత ఏమియూ ఆహారంగా తీసుకోరాదని కూడా మీరు సూచించబడవచ్చు.
మీ యొక్క కోలుకోవడం కోసం సిద్ధం అవండి

ప్రక్రియ జరిగిన తర్వాత చాలా వారాల వరకు, మీరు క్రచెస్ లేదా వాకర్స్ ఉపయోగించాల్సి ఉంటుంది, కాబట్టి మీ శస్త్రచికిత్సకు ముందు వాటిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్ళడానికి మరియు వంట, స్నానం మరియు బట్టలు ఉతకడం వంటి రోజువారీ పనులకు సహాయం లభించేలా ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఒంటరిగా నివసిస్తుంటే, మీ సర్జన్ సిబ్బంది లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ ప్లానర్ తాత్కాలిక సంరక్షకుని సూచించవచ్చు.

మీరు దేనిని ఆశించవచ్చు
ప్రక్రియకు ముందు

మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు అనస్థీషియా కావాలి. మీ ఇన్పుట్ మరియు ప్రాధాన్యతను బట్టి మిమ్మల్ని అపస్మారక స్థితిలో ఉంచే సాధారణ అనస్థీషియాను ఉపయోగించాలా, లేదా మిమ్మల్ని మేల్కొనేలా చేసే వెన్నెముక సంబంధిత అనస్థీషియాను ఉపయోగించాలా అనేది నిర్ణయించడంలో సహాయపడుతుంది.

శస్త్రచికిత్స చేసే ముందు, చేస్తున్నప్పుడు మరియు పూర్తయిన తరువాత వ్యాధి సంక్రమణను నివారించడంలో సహాయపడే ఇంట్రావీనస్ యాంటీబయాటిక్ ఇవ్వబడుతుంది. మీ మోకాలి చుట్టూ తిమ్మిరి కలిగేలా చేయుటకు మీకు ఒక నర్వ్ బ్లాక్ కూడా ఇవ్వబడవచ్చు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తిమ్మిరి క్రమంగా తగ్గిపోతుంది.

ప్రక్రియ జరిగే సమయంలో

మీ మోకాలి యొక్క జాయింట్ అన్ని వైపులా కనిపించేలా కాస్త వంపుగా ఉంచబడుతుంది. సుమారు 6 నుండి 10 అంగుళాల (15 నుండి 25 సెం.మీ.) పొడవైన గాటు వేసిన తరువాత, మీ సర్జన్­చే మీ మోకాళ్లచిప్ప ప్రక్కకు జరుపబడుతుంది మరియు జాయింట్ యొక్క పాడయిన ఉపరితలం కోయబడుతుంది.

జాయింట్ ఉపరితలాలను తగిన విధంగా సిద్ధం చేయబడిన తరువాత, కృత్రిమ జాయింట్ భాగాలను సర్జన్ తగిలిస్తారు. గాటుని మూసివేసే ముందు, అతను లేదా ఆమె మీ మోకాలిని వంచడం మరియు మెలి త్రిప్పుతూ, దాని సరైన పనితీరును నిర్ధారించడానికి టెస్ట్ చేయడం జరుగుతుంది. శస్త్రచికిత్స సుమారు రెండు గంటలు పాటు చేయబడుతుంది.

ప్రక్రియ పూర్తయిన తరువాత

మీరు ఒకటి నుండి రెండు గంటల కోసం రికవరీ గదికి తీసుకెళ్లబడతారు. అప్పుడు మీరు మీ ఆసుపత్రి గదికి తీసుకెళ్లబడతారు, అక్కడ మీరు కొన్ని రోజులు ఉండవలసి ఉంటుంది. మీ డాక్టర్ ద్వారా సూచించబడిన మందులు వాడకం ద్వారా నొప్పిని నియంత్రించడంలో సహాయపడతాయి.

హాస్పిటల్­లో విశ్రాంతి తీసుకొంటున్నప్పుడు, మీ కాలు మరియు చీలమండను కదిలించేలా మీరు ప్రోత్సహించబడతారు, ఇది మీ కాలి కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు వాపు మరియు రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. మీరు మోకాలిలో వాపు మరియు రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి బ్లడ్ థిన్నర్స్ పొందుతారు మరియు మద్దతు అందించే ట్యూబ్ లేదా కంప్రెషన్ బూట్లు ధరించాలి.
మీరు పదేపదే శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయమని చెప్పబడతారు మరియు అది క్రమంగా మీ కార్యాచరణ స్థాయిని పెంచుతుంది.

శస్త్రచికిత్స చేయబడిన తర్వాత మరుసటి రోజు, ఒక శారీరక వ్యాయామ నిపుణుడు మీ కొత్త మోకాలికి ఎలా వ్యాయామం చేయాలో మీకు చూపిస్తారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత, మీరు ఇంట్లో లేదా ఒక వ్యాయామ కేంద్రంలో శారీరక వ్యాయామాన్ని కొనసాగించాలి.
సూచించిన విధంగా మీ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. చక్కగా కోలుకోవడానికి, గాయం గురించి సరియైన జాగ్రత్త, ఆహారం మరియు వ్యాయామానికి సంబంధించి మీ సంరక్షణ బృందం యొక్క అన్ని సూచనలను అనుసరించాలి.

చాలా మందికి, మోకాలి మార్పిడి వలన నొప్పి ఉపశమనం, మెరుగైన చైతన్యం మరియు మంచి జీవన నాణ్యతను అందిస్తుంది. మరియు చాలా వరకు మోకాలి మార్పిడి 15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంటుందని భావిస్తున్నారు.

శస్త్రచికిత్స తర్వాత మూడు నుండి ఆరు వారాలలో, మీరు సాధారణంగా షాపింగ్ మరియు తేలికపాటి ఇంటి పనులు వంటి రోజువారీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చు. కారులో కూర్చునేలా మీ మోకాలిని వంచగలిగితే, బ్రేక్‌లు మరియు యాక్సిలరేటర్‌ను ఆపరేట్ చేయడానికి మీకు తగినంత కండరాల నియంత్రణ కలిగి ఉంటే, మరియు మీకు ఇంకా నిద్రకోసం వాడే నొప్పి నివారణ మందులు వాడనట్లయితే డ్రైవింగ్ చేయటం కూడా మూడు వారాల్లో సాధ్యమవుతుంది.

కోలుకున్న తర్వాత, మీరు నడక, ఈదడం, గోల్ఫ్ ఆడటం లేదా బైక్ రైడింగ్ వంటి వివిధ తక్కువ ప్రభావిత కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. అయితే జాగింగ్, స్కైయింగ్, టెన్నిస్ మరియు తాకడం లేదా దూకడం వంటి అధిక-ప్రభావ క్రీడా కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండాలి. పాటించవలసిన మీ కట్టుబాట్ల గురించి మీ వైద్యుడితో మాట్లాడాలి.

అపోలో ఆసుపత్రిలో అందించబడే మోకాలి మార్పిడి రకాలు

భారతదేశంలోని అపోలో హాస్పిటల్లో నిర్వహించబడే మోకాలి శస్త్రచికిత్స మరియు సంబంధిత చికిత్సలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

మోకాలి మార్పిడి

తీవ్రమైన కీళ్ళవాతంతో బాధపడుతున్న రోగులకు తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది మరియు రోజువారీ కార్యకలాపాలను కూడా కష్టతరం చేస్తుంది, మొత్తం మోకాలి మార్పిడి అనేది ఉత్తమ పరిష్కారం. ఈ ప్రక్రియలో ఎముక మరియు కణజాలం యొక్క అన్ని వ్యాధి భాగాల చివర్లను తొలగించడం మరియు వాటిని లోహపు మరియు అధిక-సాంద్రత కలిగిన ప్లాస్టిక్ భాగాలతో రీప్లేస్ చేయడం ద్వారా జాయింట్ సాధారణ కదలికను అనుమతించే ఆకారాన్ని రూపొందించడం జరుగుతుంది. శస్త్రచికిత్స సమయంలో ఇతర మోకాలి వైకల్యాలు కూడా సరిచేయబడతాయి.

పాక్షిక మోకాలి మార్పిడి

కీళ్ళవాతపు రోగులకు ఈ మినిమల్ ఇన్వాసివ్ విధానం ఒక ఎంపిక, దీనిలో మోకాలిలో కొంత భాగం మాత్రమే ప్రభావితమవుతుంది. పాక్షిక మోకాలి మార్పిడిలో వ్యాధిగ్రస్తమైన భాగాన్ని తొలగించి, దాని స్థానంలో మెటల్ ఇంప్లాంట్ అమర్చడం జరుగుతుంది.

హై టిబియల్ ఆస్టియోటోమీ

ఆస్టియోటోమీ అనేది ఒక శస్త్రచికిత్స, ఇది ఎముకలను జాయింట్­గా తయారుచేయడం మరియు వాటిని పూర్వ స్థితికి మార్చడం. దీనిని సాధారణంగా చిన్నవయస్కులైన రోగులలో కీళ్ళవాతం చికిత్సకు ఉపయోగిస్తారు, మరియు చాలా బలహీన జాయింట్ సాకెట్లు కలిగినవారికి ఇది ప్రత్యేకంగా సిఫార్సు చేయబడుతుంది. అధిక టిబియల్ ఆస్టియోటోమీలో, ఈ భాగంలో ఎముక యొక్క ఒక చిన్న భాగాన్ని తొలగించడం ద్వారా టిబియా యొక్క పై భాగం – దిగువ కాలు ఏర్పడే అవయవాలలో ఒకటి – పునరుత్పత్తి చేయబడుతుంది.

ఆర్థోగ్లైడ్ మధ్యస్థ మోకాలి వ్యవస్థను ఉపయోగించి కనిష్టంగా ఇన్వాసివ్ మోకాలి మార్పిడి (రిసర్ఫెస్) శస్త్రచికిత్స (MIKRS).

ఆర్థోగ్లైడ్, ఒక లోహం, చీలిక ఆకారపు పరికరం, ఇది మోకాలి లోపల అరిగిపోయిన మృదులాస్థిని రీప్లేస్ చేసే ఒక నూతనమైన ఇంప్లాంట్. ఇది మొత్తం మోకాలి మార్పిడి కోసం రోగులకు తక్కువ హానికర ఎంపికను అందిస్తుంది. ఈ పరికరం 5 నుండి 7 సెం.మీ. గాటు ద్వారా మోకాలికి చొప్పించబడుతుంది, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, సరైన జాయింట్ అమరికను పునరుద్ధరిస్తుంది, లోడ్‌ను మరింత సమానంగా పునః పంపిణీ చేస్తుంది మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ శస్త్రచికిత్స సాధారణ జీవనశైలి విధులను తిరిగి పొందడానికి తక్కువ ఖరీదైన మరియు సులభమైన విధానాన్ని నిర్థారిస్తుంది మరియు ఇది ఖచ్చితంగా మోకాలి ఆర్థరైటిస్‌తో వ్యవహరించే చురుకైన మరియు చిన్న వయస్కులైన రోగులకు శస్త్రచికిత్స మరియు దీర్ఘకాలిక పునరావాసం తర్వాత ఎక్కువ ఆందోళన చెందేవారికి కొత్త ఆశను కలిగిస్తుంది.

ప్రామాణిక మోకాలి మార్పిడి కంటే ఈ శస్త్రచికిత్స యొక్క ప్రధాన ప్రయోజనాలు అయిన అందుబాటులో ఉండే ఖర్చు మరియు ముందస్తు పునరావాసం, రోగులు వారి సాధారణ దినచర్య మరియు జీవనశైలికి త్వరగా కోలుకొనేలా సహాయపడుతుంది. ఇది రోగికి గొంతుకూర్చోవడం మరియు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వంటివి చేయగలిగేలా అనుమతిస్తుంది, ఇది భారతదేశంలో మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం మరియు సాంప్రదాయ వైద్య మోకాలి మార్పిడి శస్త్రచికిత్సతో ఇది సాధ్యం కాదు. అన్నింటికంటే రోగులకు వృద్దులయ్యేవరకు మరియు రెండవ మోకాలి మార్పిడి అవసరమయ్యే వరకు మొత్తం మోకాలి మార్పిడి ఆలస్యాన్ని ఆర్థోగ్లైడ్ అనుమతిస్తుంది.

మోకాలి మార్పిడికి వ్యతిరేకంగా, మినిమల్ ఇన్వాసివ్ మోకాలి మార్పిడి (పునరుజ్జీవనం) శస్త్రచికిత్సలో 2-అంగుళాల గాటు వేయబడుతుంది, స్వాభావిక ఎముక కట్ చేయబడదు, జాయింట్­ని తాకకుండా ఉండేలా చేస్తుంది, కండరాన్ని కట్ చేయవలసిన అవసరం లేదు అందువలన ఎలాంటి రక్తస్రావం జరుగదు, కాస్త నొప్పి అనిపిస్తుంది, వ్యాధి సంక్రమణ కూడా తక్కువగానే ఉంటుంది, అతి తక్కువ సమస్యలు, వేగంగా కోలుకోవడం, అదే రోజున డిశ్చార్జ్ కావడం జరుగుతుంది, శస్త్రచికిత్సను డే కేర్ సర్జరీగా చేయవచ్చు మరియు అందువల్ల ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదు.

రోగి నిర్దిష్ట జిగ్స్ ఉపయోగిస్తూ మొత్తం మోకాలి మార్పిడి చేయుట

రోగి యొక్క నిర్దిష్ట జిగ్స్ ఉపయోగించి మొత్తం మోకాలి మార్పిడి చేయుట అనేది ఒక కొత్త అత్యాధునిక సాంకేతికత. రోగి యొక్క మోకాలు మరియు కాలు యొక్క CT స్కాన్ ఇమేజ్‌ను ఉపయోగించి నిర్ధిష్ట కట్టింగ్ బ్లాక్‌లను ముందుగానే తయారు చేస్తారు మరియు తరువాత ఈ బ్లాక్‌ల సహాయంతో శస్త్రచికిత్స చేస్తారు. ఈ సాంకేతికత మోకాలి ప్రొస్థెసిస్ యొక్క ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడమే కాక, తక్కువ ఆపరేటివ్ సమయం, రక్త నష్టం తగ్గించుట, మెరుగైన ఖచ్చితత్వం, శస్త్రచికిత్స ఫలితంలో మెరుగుదల మరియు ఆసుపత్రిలో తక్కువ సమయం ఉంటూ వేగంగా కోలుకోవడంలో సహాయపడుతుంది.

ఆదర్శవంతమైన మోకాలు

అటూన్ రొటేటింగ్ ప్లాట్‌ఫామ్ మోకాలి మార్పిడి అనేది మినిమల్ ఇన్వాసివ్ సబ్‌వాస్టస్ టెక్నాలజీతో, నొప్పిలేకుండా ఆపరేషన్ అందించే మరియు సాంప్రదాయ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స యొక్క అన్ని దుష్ప్రభావాలను తొలగించే అత్యంత ఆధునాతన సాంకేతికత. మనం హై-ఫ్లెక్సిషన్ ఇంప్లాంట్లను ఉపయోగిస్తున్నప్పుడు, శస్త్రచికిత్స తర్వాత, అపోలో హాస్పిటల్స్ రోగులు పూర్తి ఫ్లెక్సిబుల్ మరియు ఆరోగ్యకరమైన మోకాలి జాయింట్స్ పొందేలా నిర్ధారిస్తుంది. అపోలో హాస్పిటల్స్ అటూన్ రొటేటింగ్ ప్లాట్‌ఫామ్ మోకాలి మార్పిడితో పాటు భారతదేశంలో ఇతర అతి తక్కువ ఇన్వాసివ్ విధానాలకు మార్గదర్శకంగా నిలిచింది.

Telephone Call Icon Call Us Now +91 8069991061 Book Health Check-up Book Appointment

Request A Call Back

Close