తక్కువ ప్రమాదకర గుండె ఆపరేషన్ అంటే ఏమిటి?
MICS CABG లేదా MICAS అంటే మినిమల్లీ ఇన్వాసివ్ కరోనరీ అర్టెరీ బైపాస్ సర్జరీ మరియు ఇది భారతదేశంలో గుండె బైపాస్ సర్జరీ యొక్క కొత్త విధానం. తీవ్రతర గుండె జబ్బుల కోసం చేసే కరోనరీ బైపాస్ సర్జరీ యొక్క అధునాతన సాంకేతికతగా MIC నిరూపించబడింది.
MICS CABG ఎందుకు చేయబడుతుంది?
కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ, మిట్రల్ వాల్వ్ రిపేర్ మరియు రీప్లేస్‌మెంట్, అనూరిజం రిపేర్ వంటి వివిధ గుండె సంబంధిత చికిత్సలకు ప్రత్యామ్నాయంగా మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీని ఉపయోగించవచ్చు. మీ వైద్య చరిత్ర, ప్రస్తుత ఆరోగ్య స్థితి, వయస్సు మరియు టెస్ట్ ఫలితాలను బట్టి, మీ సర్జన్ మీకు ఏ విధానం సరిపోతుందో నిర్ణయిస్తారు. సాంప్రదాయ పద్ధతులతో పోల్చినప్పుడు MICS అనేక ప్రయోజనాలను కనబరచింది:
- సాంప్రదాయ గుండె శస్త్రచికిత్స మాదిరిగా కాకుండా, ఛాతి ప్రక్కల నుండి గుండెను చేరుకోవచ్చు, కాబట్టి రొమ్ము ఎముకను వేరుచేయవలసిన అవసరం లేదు. ఇది శస్త్రచికిత్స అనంతర నొప్పిని తగ్గిస్తుంది, పనితీరును నిర్వహిస్తుంది మరియు శ్వాసపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు మీ కార్డియాలజిస్ట్ యొక్క సరైన సలహాతో మీ సాధారణ జీవితానికి తిరిగి రావచ్చు మరియు డ్రైవింగ్ లేదా ఇతర కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చు.
- రక్త నష్టం మరియు రక్త మార్పిడి వలన కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అందువల్ల రక్త మార్పిడి అవసరత తక్కువగా ఉంటుంది.
- వృద్దులు మరియు డయాబెటిక్ రోగులకు అనువైన విధానం, ఎందుకంటే ఇది గాయంపై కలిగే వ్యాధి సంక్రమణ లేదా శస్త్రచికిత్స అనంతర వ్యాధి సంక్రమణ సంభావ్యతను తగ్గిస్తుంది.
- గాటు 2-3 అంగుళాలు మాత్రమే కావున, గాయం వేగవంతంగా నయం అవుతుంది మరియు అంతగా కనిపించదు.
- సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఆసుపత్రిలో ఉండవలసి సమయం 2-3 రోజులు మాత్రమే.
- అన్ని బ్లాకేజీలను వాటి స్థానంతో సంబంధం లేకుండా బైపాస్ చేయవచ్చు కాబట్టి ఇది సురక్షితమైన మరియు సమర్థవంతమైన సాంకేతికతగా పరిగణించబడింది.
MICS CABG సమయంలో ఏమి జరుగుతుంది?
మినిమల్లీ ఇన్వాసివ్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ (MICS) లో, ఎడమ వైపు నుండి 4 సెం.మీ చిన్న కట్ చేయడం ద్వారా గుండెను చేరుకోవచ్చు. చనుమొన క్రింద ఈ కట్ చేయబడుతుంది. ఎముకలను కోయకుండా కండరాలను వేరుచేస్తూ ఛాతీ యొక్క పక్కటెముకల మధ్య ప్రవేశిస్తుంది.
సాధారణ గుండె శస్త్రచికిత్స మాదిరి కాకుండా, అన్ని ధమనులు లేదా కాళ్ళ నుండి తొలగించబడిన ధమనులు మరియు సిరల కలయికను ఉపయోగించి శస్త్రచికిత్స చేయబడుతుంది. ఈ శస్త్రచికిత్సలో, కాలు నుండి తీయబడిన నాడి కాలు యొక్క చర్మాన్ని కత్తిరించకుండా ఎండోస్కోపికల్‌గా తీయబడుతుంది.
ఎంత సమయం పడుతుంది?
శస్త్రచికిత్స సాధారణంగా 30 నిమిషాల నుండి 4 గంటల వరకు చేయబడుతుంది, అయినప్పటికీ ఇది వివిధ వ్యక్తులను బట్టి ఉంటుంది. మీ సర్జన్ మీతో శస్త్రచికిత్స గురించి వివరంగా చర్చిస్తారు.
ప్రక్రియ తర్వాత ఏమి జరుగుతుంది?
సాధారణంగా, మీరు ICU లోని IV లైన్లతో ఒకటి లేదా రెండు రోజులు ఉండవలసి ఉంటుంది మరియు మీ రికవరీని బట్టి మీరు వార్డుకు బదిలీ చేయబడతారు.
ఈ ప్రక్రియలో అపోలో యొక్క నైపుణ్యత
భారతదేశంలో CABG లేదా కరోనరీ బైపాస్ సర్జరీని రొమ్ము ఎముక లేదా ఉరోస్థిని విడదీయడం లేదా లేదా కోయడం ద్వారా చేయబడుతుంది. MICAS లేదా MICS CABG శస్త్రచికిత్స సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది మరియు తక్కువ ప్రమాదకార పరిష్కారాన్ని అందిస్తుంది. అపోలో హాస్పిటల్స్ భారతదేశంలో 400 MICSCABG శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశాయి మరియు కరోనరీ సర్జరీ చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.
అత్యంత అధునాతన పరికరాలు, అధునాతన పద్ధతులు మరియు నైపుణ్యం కలిగిన వైద్యులతో, అపోలో హాస్పిటల్స్ చాలా సురక్షితమైన పద్ధతిలో శస్త్రచికిత్స చేస్తాయి, ఇది భారతదేశంలో MICS CABG శస్త్రచికిత్స చేసే ఉత్తమమైన ఆసుపత్రులలో ఒకటిగా నిలిచాయి.
అపోలో హాస్పిటల్స్ గుండె సంబంధిత ప్రక్రియలు మరియు శస్త్రచికిత్సలలో సరిపోలని ఫలితాలతో అగ్రగామిగా ఉన్నాయి. మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీ (MICS) టెక్నిక్ ఉపయోగించి మినిమల్లీ ఇన్వాసివ్ హైబ్రిడ్ రివాస్కులరైజేషన్ విధానం (రోబోటిక్ సహాయంతో గానీ మరియు లేకుండా గానీ), మల్టీ-వెసెల్ బీటింగ్ హార్ట్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ మొదలగు వాటిని ముందుగా పరిచయం చేసిన సంస్థ.
డిశ్చార్జ్ అయిన తర్వాత ఇవ్వబడే సూచనలు
మీరు ఆసుపత్రి లేదా మీకు చికిత్స చేసే వైద్యునితో సంప్రదించాలి లేదా 1066 కు కాల్ చేయాలి, ఒకవేళ మీకు:
- మీకు అధిక జ్వరంగా ఉంటే
- వేగవంతంగా గుండె కొట్టుకోవటం
- మీ ఛాతీ గాయం చుట్టూ కొత్తగా వచ్చిన లేదా తీవ్రమవుతున్న నొప్పి
- మీ ఛాతీ గాయం చుట్టూ ఎర్రబడటం లేదా రక్తస్రావం లేదా ఇతర స్రావాలు డిశ్చార్జ్ కావడం
తరచుగా అడిగే ప్రశ్నలు
1. MICS CABG అంటే ఏమిటి?
MICS CABG అనేది కరోనరీ ఆర్టరీ బైపాస్ లేదా CABG యొక్క ఒక అధునాతన సాంకేతికత, దీనిలో ఛాతీ యొక్క ఒక ప్రక్కన (ఎడమవైపు) చిన్న కోత ద్వారా శస్త్రచికిత్స చేయబడుతుంది.
2. ఇది సాంప్రదాయ CABG కి ఎలా భిన్నమైనది?
సాంప్రదాయిక సాంకేతికతలో CABG లేదా కరోనరీ ఆర్టరీ బైపాస్‌లో రొమ్ము ఎముక లేదా స్టెర్నమ్‌ను సగానికి వేరుచేయడం జరుగుతుంది. సాంప్రదాయ బైపాస్ శస్త్రచికిత్సలో కోలుకోవడానికి ఎముక నయం కావడానికి 8 వారాల కంటే ఎక్కువ సమయo పడుతుంది. MICS CABG శస్త్రచికిత్స ఛాతీ గోడ ద్వారా జరుగుతుంది, ఇది స్టెర్నమ్‌లో ఎలాంటి కోత లేనందున ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. చికిత్సలో పూర్తిగా నయం కావడానికి సాధారణంగా 10 రోజులు సమయం తీసుకొంటుంది.
3. MICS CABG స్వల్ప వ్యవధి మరియు వేగవంతoగా కోలుకోవటం జరుగుతుందా?
ఖచ్చితంగా అవును. హాస్పిటల్లో 2 – 3 రోజులు మాత్రమే ఉండవలసి ఉంటుంది మరియు చాలా మంది రోగులు తిరిగి కార్యకలాపాలకు వెళతారు లేదా 10 రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు. అందువల్ల, కోలుకోవడానికి అధికంగా సమయం తీసుకొనే సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, శస్త్రచికిత్స అయిన తర్వాత మీరు ఆస్పత్రి నుండి తొందరగా డిశ్చార్జ్ అయి మీ దైనందిన కార్యకలపాలను చేసుకోగలుగుతారు.
4. MICS CABG అనేది హృదయ స్పందన సంబంధిత ఆపరేషనా?
MICS CABG అనేది ఒక హృదయ స్పందన సంబంధిత మల్టీ-వెసెల్ ప్రక్రియ. పంపు యొక్క మద్దతు తరచుగా అవసరం లేదు, కానీ గుండె స్పందిస్తూ ఉండగా శస్త్రచికిత్స ఇప్పటికీ జరుపబడుతుంది. గుండె బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే పంపు యొక్క మద్దతు అందించబడుతుంది.
5. MICS CABG మరియు MIDCAB ఒకటేనా?
లేదు, అవి ఒకేలా ఉండవు. MIDCAB అనేది ఒక పాత సాంకేతికత, దీనిలో ఒకటి లేదా రెండు నాళాలు మాత్రమే గ్రాఫ్టింగ్ చేయవచ్చు. ప్రజలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియకపోతే, ప్రజలు తరచుగా ఆధునిక MICS CABG గురించి గందరగోళానికి గురవుతారు.
6. నేను ఒక మధుమేహ రోగిని. MICS CABG నాకు సరైనదా?
వ్యాధి సంక్రమణ దాదాపుగా తగ్గించబడినందున మీరు MICSCABG కి అనువైన అభ్యర్థి కావచ్చు. మీ నాళాలు నాణ్యత మీరు ఈ సాంకేతికతకు తగిన అభ్యర్థియేనా కాదా అనేది నిర్ణయిస్తాయి మరియు ఈ విషయంలో మీ సర్జన్ ఇచ్చే తీర్పు సరియైనది.
7. MICS CABG తరువాత కలిగే వ్యాధి సంక్రమణ ప్రమాదం ఏమిటి?
వ్యాధి సంక్రమణ ప్రమాదం దాదాపు సున్నా. ఒక మధుమేహ రోగికి కూడా, అన్ని అంటువ్యాధులు MICS CABG లో గణనీయంగా తగ్గుతాయి
8. నేను ఒక ధూమపానం చేసేవాన్ని / ఉబ్బసం రోగిని. MICS CABG ఇప్పటికీ నాకు ఒక ఎంపిక అవుతుందా?
అవును. ఇది మీకు ఒక అనువైన చికిత్స ఎంపిక కావచ్చు. మీ శ్వాసకోశ చికిత్సకునితో సహా మీ సర్జన్ సంబంధిత నిర్ణయం తీసుకోవాలి.
9. మల్టీవెసెల్ బ్లాకేజీ గల రోగులందరూ MICS CABG కోసం అభ్యర్థులుగా ఉంటారా?
లేదు, మల్టీవెసెల్ కరోనరీ బ్లాకేజీ కలిగి ఉన్న రోగులందరూ MICS CABG కోసం అభ్యర్థులు కాదు. దీర్ఘకాల వ్యాధి లేదా చాలా పేలవమైన గుండె పనితీరు కలిగిన రోగి ఈ సాంకేతికతకు తగిన అభ్యర్థిగా పరిగణించబడరు. మీరు అభ్యర్థిగా ఉంటారా లేదా అనేది నిర్ణయించడంలో మీ హార్ట్ సర్జన్ ఉత్తమ వ్యక్తి.
10. అన్ని కేంద్రాలలో MICS CABG నిర్వహించబడుతుందా?
లేదు, MICS చేయటానికి అందరు హార్ట్ సర్జన్లు శిక్షణ ఇవ్వబడరు. మాతో సహా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కేంద్రాలు మాత్రమే MICS ను సురక్షితంగా నిర్వహించగలవు.
11. ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్టింగ్ అంటే ఏమిటి?
ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్టింగ్ (EVH) వలన MICS CABG కి ప్రయోజనాన్ని చేరుస్తుంది. అత్యాధునిక పరికరాలు మరియు రోగి యొక్క అసాధారణమైన సౌకర్యంతో నాణ్యతను నిర్ధారిస్తాయి. EVH అనేది ఎండోస్కోప్‌తో బైపాస్ కండ్యూట్గా ఉపయోగించటానికి కాలిలో సిరను కత్తిరించుటకు ఉపయోగించే ఒక సాంకేతికత.
సంప్రదిస్తూ ఉండండి
మా కార్డియాలజిస్టులు మరియు కార్డియాక్ సర్జన్లతో అపాయింట్‌మెంట్ పొందడానికి, ఇక్కడ క్లిక్ చేయండి