సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images
అపోలో హాస్పిటల్స్విధానముకరోనరీ యాంజియోగ్రామ్

కరోనరీ యాంజియోగ్రామ్

కరోనరీ యాంజియోగ్రామ్ అంటే ఏమిటి?

కరోనరీ యాంజియోగ్రామ్ అనేది కరోనరీ ఆర్టరీస్ అని పిలువబడే మీ గుండె రక్త నాళాలను చూడడానికి X-రే ఇమేజింగ్‌ను ఉపయోగించే ఒక సాంకేతికత. గుండెకు చేరే రక్త ప్రవాహంలో ఏమైనా అవరోధం ఉందా అనేది తెలుసుకోవడానికి టెస్ట్ చేయబడుతుంది.

కరోనరీ యాంజియోగ్రామ్స్ అనేవి కార్డియాక్ క్యాథటరైజేషన్ అని పిలువబడే సార్వత్రిక సమూహ విధానాలలో ఒక భాగం. గుండె మరియు రక్తనాళాల స్థితులను కార్డియాక్ క్యాథటరైజేషన్ ప్రక్రియలు నిర్ధారించగలవు మరియు చికిత్స చేయగలవు. గుండె యొక్క స్థితులను నిర్ధారించడంలో సహాయపడే కరోనరీ యాంజియోగ్రామ్స్ అనేవి కార్డియాక్ క్యాథటరైజేషన్ ప్రక్రియ యొక్క ఒక అత్యంత సాధారణ రకం.

కరోనరీ యాంజియోగ్రామ్ ప్రక్రియ చేసే సమయంలో, X-రే మెషీన్ ద్వారా కనుగొనబడే ఒక రకమైన వర్ణపదార్థం మీ గుండె రక్త నాళాలలోకి ప్రవేశిస్తుంది. X-రే మెషీన్ వేగంగా అనేక చిత్రాలను (యాంజియోగ్రామ్స్) తీసుకుంటుంది, రక్త నాళాల గురించి వివరంగా తెలియజేస్తుంది. అవసరమైతే, కరోనరీ యాంజియోగ్రామ్‌ వలే అదే సెషన్‌లో ఆటంకపరచబడిన గుండె ధమనులను (యాంజియోప్లాస్టీ) మీ డాక్టర్ తెరవవచ్చు.

కరోనరీ యాంజియోగ్రామ్ ఎందుకు చేస్తారు?

మీకు కరోనరీ యాంజియోగ్రామ్ చేయవలసి ఉంటుందని మీ డాక్టర్ సూచించడానికి కొన్ని సాధారణ కారణాలు: ఛాతీ నొప్పి (యాంజినా) వంటి కరోనరీ ఆర్టరీ వ్యాధి యొక్క లక్షణాలు

  • ఛాతీ నొప్పి (యాంజినా) వంటి కరోనరీ ఆర్టరీ వ్యాధి యొక్క లక్షణాలు
  • మీ ఛాతీ, దవడ, మెడ లేదా చేతిలో నొప్పి వంటివి ఇతర టెస్ట్­ల ద్వారా బయటపడకపోవచ్చు
  • మీ ఛాతీ, దవడ, మెడ లేదా చేతిలో నొప్పి వంటివి ఇతర టెస్ట్­ల ద్వారా బయటపడకపోవచ్చు
  • కొత్తగా లేదా పెరిగిన ఛాతీ నొప్పి (అస్థిర యాoజినా)
  • మీరు గుండె సంబంధిత లోపంతో జన్మించిన (పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు)
  • నాన్-ఇన్వాసివ్ కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్­లో అసాధారణ ఫలితాలు
  • ఇతర రక్తనాళ సమస్యలు లేదా ఛాతి సంబంధిత గాయం
  • శస్త్రచికిత్స చేయవలసిన హార్ట్ వాల్వ్ సమస్య
  • పరిశోధన యొక్క హానికర స్వభావం కారణంగా, ఒక ఎలక్ట్రో కార్డియోగ్రామ్ లేదా ఎకోకార్డియోగ్రామ్ స్ట్రెస్ టెస్ట్ వంటి హానికరం కాని గుండె పరీక్షలు చేసే వరకు యాంజియోగ్రామ్‌లు సాధారణంగా నిర్వహించబడవు.

మీరు ఎలా సిద్ధం అవుతారు?

  • కొన్ని సందర్భాల్లో, కరోనరీ యాంజియోగ్రామ్­లను అత్యవసర ప్రాతిపదికన నిర్వహించబడతాయి. ఇతర అన్ని సందర్భాల్లో, అవి ముందుగానే షెడ్యూల్ చేయబడతాయి, మీరు సిద్ధం కావడానికి కొంత సమయం ఇవ్వబడతారు.
  • ఆసుపత్రి యొక్క క్యాథటరైజేషన్ (క్యాథ్) ల్యాబ్‌లో యాంజియోగ్రామ్‌లను నిర్వహిస్తారు. మీ ఆరోగ్య సంరక్షణ బృందం మీకు నిర్దిష్ట సూచనలను ఇస్తుంది మరియు మీరు ఇప్పటికే తీసుకుంటున్న మందుల గురించి మీతో మాట్లాడుతుంది.

సాధారణ మార్గదర్శకాలు:

  • మీ యాంజియోగ్రామ్‌ చేయుటకు ముందు అర్ధరాత్రి తర్వాత ఏదియూ తినకూడదు లేదా త్రాగకూడదు.
  • ఔషధాలన్నింటినీ మీతో పాటు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. మీ సాధారణ మందులను తీసుకోవాలా వద్దా అనేది మీ వైద్యుని అడిగి తెలుసుకోవలెను.
  • మీకు డయాబెటీస్ ఉన్నట్లయితే, మీ యాంజియోగ్రామ్ చేసే ముందు ఇన్సులిన్ లేదా ఇతర నోటి ద్వారా తీసుకొనే మందులు తీసుకోవాలా వద్దా అనేది మీ వైద్యుని అడిగి తెలుసుకోవలెను.
  • మీకు ఏవైనా అలెర్జీలు ఉంటే, మీరు మీ వైద్యునికి తెలియజేయాలి. మీరు ఇంతకుముందు ఇంట్రావీనస్
  • కాంట్రాస్ట్ మీడియా (కిడ్నీ X-రేస్ మరియు CT స్కాన్ల కోసం ఉపయోగించే వర్ణ పదార్ధం) ద్వారా ప్రభావితమైతే, మీరు దీని గురించి మీ వైద్యునికి తప్పనిసరిగా తెలియజేయాలి.
  • సాధారణంగా చేయి లేదా గజ్జల్లోని పెద్ద ధమనిని ఉపయోగించి ఈ ప్రక్రియ నిర్వహించబడుతుంది కాబట్టి, ఈ ప్రాంతం చుట్టూ చర్మాన్ని షేవింగ్ చేయమని మీరు చెప్పబడతారు మరియు ఆందోళన నుండి ఉపశమనం పొందటానికి మీరు ఉపశమనకారిని పొందవచ్చు.
  • సంబంధిత బృందం మీ యొక్క శారీరక పరీక్ష చేస్తుంది మరియు మీలో ముఖ్యమైన సంకేతాలను తనిఖీ చేస్తుంది – అవి రక్తపోటు మరియు నాడి వేగం.
  • మీరు మీ మూత్రాశయాన్ని కూడా ఖాళీ చేసి హాస్పిటల్­లో అందించే గౌను ధరించాలి. మీరు కాంటాక్ట్ లెన్సులు, కళ్ళజోడు, నగలు మరియు హెయిర్‌పిన్స్­ను తొలగించాల్సి ఉంటుంది.

యాంజియోగ్రామ్ చేసే సమయంలో ఏమి జరుగుతుంది?

  • యాంజియోగ్రామ్ యొక్క ప్రక్రియను వివరించిన తరువాత ప్రక్రియ నిర్వహించే ముందు రోగి/అటెండర్ యొక్క సమ్మతి తీసుకోబడుతుంది.
  • సాధారణంగా వెల్లకిలా X-రే టేబుల్‌పై పడుకోమని మీరు సూచించబడతారు. మీ చేతి యొక్క సిరలో ఒక సూది అమర్చబడి ఉంటుంది, తద్వారా కార్డియాలజిస్ట్ మీకు ఉపశమనకారి లేదా నొప్పి నివారణ మందులను వేస్తారు. మీరు మీ ఛాతీ మరియు చేతి వ్రేలికి తగిలించబడిన మానిటరింగ్ పరికరాన్ని అలానే ఉంచవచ్చు మరియు మీ ముక్కులోకి చిన్న గొట్టాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది.
  • లోపలికి చొప్పించే ప్రదేశానికి సమీపంలో ఉన్న చర్మం, బహుశా చేయి లేదా నడుము భాగo క్రిమినాశకంతో శుభ్రం చేయబడుతుంది, ఆపై మీ శరీరమంతా థియేటర్ టవల్­తో కప్పబడి ఉంటుంది.
  • స్థానిక అనస్థీషియా కారణంగా ధమని పైన ఉన్న చర్మం మరియు లోతైన కణజాలం మొద్దుబారిపోతుంది మరియు ధమనిలోకి సూది ఇంజెక్ట్ చేయబడుతుంది. కార్డియాలజిస్ట్ అది సరిగ్గా అమర్చబడిందని సంతృప్తి చెందిన తర్వాత, ఒక గైడ్ వైర్ సూది ద్వారా ధమనిలోకి దూర్చబడుతుంది. అప్పుడు సూది తొలగించబడుతుంది, క్యాథెటర్ అని పిలువబడే చక్కటి ప్లాస్టిక్ గొట్టాన్ని వైర్ పైన మరియు ధమనిలో అమర్చడానికి ఇది అనుమతిస్తుంది.
  • కార్డియాలజిస్ట్ క్యాథెటర్ మరియు వైర్ సరైన స్థితిలో ఉంచబడిందని నిర్ధారించడానికి X-రే పరికరాలను ఉపయోగించి తరువాత వైరుని తొలగిస్తారు.
  • ఒక ప్రత్యేక వర్ణ పదార్ధం, కాంట్రాస్ట్ మీడియం, క్యాథెటర్ ద్వారా ఇంజెక్ట్ చేయబడుతుంది మరియు అది X-రే ద్వారా పరిశీలించబడుతుంది. ఈ వర్ణ పదార్థాన్ని X-రే చిత్రాల ద్వారా చూడటం చాలా సులభం. ఇది మీ రక్త నాళాల గుండా ప్రవహిస్తున్నప్పుడు, మీ వైద్యుడు దాని ప్రవాహాన్ని గమనిస్తూ ఏవైనా అడ్డంకులు లేదా ఇరుకైన భాగాలను గుర్తించవచ్చు.
  • మీ యాంజియోగ్రామ్ నిర్వహించే సమయంలో మీ వైద్యుడు కనుగొన్న దానిపై ఆధారపడి, ఇరుకైన ధమనిని ఓపెన్ చేయడానికి బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ ప్లేస్‌మెంట్ వంటి అదనపు క్యాథెటర్ విధానాలను మీరు పొందవచ్చు.
  • కార్డియాలజిస్ట్ తగిన అన్ని X-రే ఫలితాలను నిర్థారించిన తర్వాత మరియు రోగి నుండి అవసరమైన సమాచారాన్ని పొందిన తరువాత, క్యాథెటర్ తొలగించబడుతుంది.

ఈ ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది?

ప్రతీ రోగి యొక్క స్థితి భిన్నంగా ఉంటుంది మరియు ఈ ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉంటుందో లేదా ఎంత సూటిగా ఉంటుందో ఊహించడం ఎల్లప్పుడూ అంత సులభం కాదు. ప్రక్రియ యొక్క స్థానాన్ని బట్టి, ఉదాహరణకు, కాలు భాగంలో పెద్ద ధమనిని ఉపయోగిస్తే, అది 45 నిమిషాల నుండి గంట వరకు సమయం తీసుకొంటుంది మరియు చిన్న ధమనులను ఉపయోగించడం మరింత క్లిష్టంగా ఉండవచ్చు అలాగే ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ఒక మార్గదర్శిగా X-రే గదిలో మొత్తానికి రెండు గంటల పాటు సమయం తీసుకొంటుంది మరియు సగటు ఫ్లోరో సమయం 10 నిమిషాల కన్నా తక్కువగా ఉండవచ్చు.

ప్రక్రియ పూర్తయిన తరువాత ఏమి జరుగుతుంది?

మీరు వీల్‌చైర్/స్ట్రెచర్‌లో మీ రికవరీ గదికి తిరిగి తీసుకెళ్లబడతారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేలా, మీ నాడి కొట్టుకోవటం మరియు రక్తపోటు స్థాయిలను రికార్డ్ చేస్తూ తనిఖీ చేయడానికి నర్సులు క్రమం తప్పకుండా పరిశీలనలు చేస్తారు. గాటు వేసిన భాగం నుండి రక్తస్రావం జరగకుండా ఉండేలా జాగ్రత్త తీసుకొంటారు. మీరు కోలుకునే వరకు మీరు సాధారణంగా కొన్ని గంటలు పాటు మంచం మీద విశ్రాంతి పొందుతారు. అదే రోజు ఇంటికి తిరిగి వెళ్లిపోయేలా మిమ్మల్ని అనుమతించవచ్చు లేదా ఒక రాత్రి ఆసుపత్రిలో ఉంచవచ్చు.

అపోలో హాస్పిటల్లోని డేకేర్ యాంజియోగ్రామ్‌లు రోగులలో ఆనందాన్ని నింపడం, ఆసుపత్రిలో తక్కువ సమయం ఉండడం మరియు ఎలాంటి ఇబ్బంది లేకుండా అదే రోజు డిశ్చార్జ్ అయ్యేలా సరియైన విధానాలపై దృష్టి సారించడం జరిగినది.

మీరు ఈ ఫలితాన్ని చూడగలరు?

మీయొక్క తదుపరి సందర్శన తర్వాత స్కాన్ రిపోర్ట్ పరిశీలించబడుతుంది మరియు CD రూపంలో సంబంధిత ప్రింట్ రిపోర్ట్ మీతో షేర్ చేయబడుతుంది.

మీ రక్త నాళాలలో ఎక్కడ సమస్య ఉంది అనేది యాంజియోగ్రామ్స్ సూచించగలవు. అలాగే ఇది:
క్రొవ్వు నిల్వలు (అథెరోస్క్లెరోసిస్) ద్వారా మీ కరోనరీ ధమనులు ఎన్ని ఆటంకపరచబడినవి లేదా ఇరుకుగా ఉన్నాయో చూపిస్తుంది
మీ రక్త నాళాలలో అడ్డంకిగా ఉన్న పిన్‌పాయింట్లు

మీ రక్త నాళాల ద్వారా రక్త ప్రవాహం ఎంత వరకు నిరోధించబడిందో చూపిస్తుంది

మీ గుండె మరియు రక్త నాళాల ద్వారా జరిగే రక్త ప్రవాహాన్ని తనిఖీ చేయండి

ఈ సమాచారం తెలుసుకోవడం వలన మీ వైద్యుడు మీకు ఏ చికిత్స సరియైనదో మరియు మీ గుండె యొక్క స్థితి మీ ఆరోగ్యానికి ఎంత వరకు ప్రమాదకరమో నిర్ణయించడంలో సహాయపడుతుంది. మీ ఫలితాలను బట్టి, వైద్య నిర్వహణ, యాంజియోప్లాస్టీ లేదా కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ వంటి చికిత్సలలో దేని ద్వారా ప్రయోజనం మీరు పొందగలరనేది మీ వైద్యుడు నిర్ణయించవచ్చు.

Telephone Call Icon Call Us Now +91 8069991061 Book Health Check-up Book Appointment

Request A Call Back

Close