ఎపిలెప్సీ(మూర్ఛ) నిర్వచనం
ఎపిలెప్సీ అనేది నాడీ సంబంధ (కేంద్రీయ నాడీ వ్యవస్థ) రుగ్మత, దీని లక్షణాలలో మూర్ఛ పోవడం, స్వల్ప కాలిక అసాధారణ ప్రవర్తన సంఘటనలు, సంవేదనలు, ఇంకా మెదడు నాడుల్లోని కణాల కార్యకలాపాలకు విఘాతం కలగటం కారణంగా కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం ఉంటాయి..
ఎపిలెప్సీ లక్షణాలు
మూర్ఛల సంకేతాలు మరియు లక్షణాలు:
- కాళ్ళుచేతులు అసంకల్పితంగా, నియంత్రణ కోల్పోయి కదలడం
- స్పృహ కోల్పోవడం మరియు అపస్మారకత
- అయోమయం, శూన్యంలోనికి చూస్తూ ఉండటంతో కూడిన మానసిక లక్షణాలు
మూర్ఛకు దారి తీసే అంశాలు
మూర్ఛపోయే ప్రమాదాన్ని అధికం చేసే అంశాలు:
- వయసు – సాధారణంగా బాల్యం తొలి నాళ్లలో, 60 సంవత్సరాలు దాటిన తర్వాత దీని బారిన పడే అవకాశం ఉంది కానీ, దీని లక్షణాలు ఏ వయసులోనైనా బయటపడవచ్చు
- కుటుంబ చరిత్ర – ఎపిలెప్సీ(మూర్ఛల) కుటుంబ చరిత్ర
- తలకు గాయాలు – కొన్ని సందర్భాల్లో
- స్ట్రోక్ మరియు ఇతర హృదయ కండర సంబంధ వ్యాధులు – మెదడు దెబ్బ తినడానికి కారణమయ్యే ఏ స్ట్రోక్ అయినా ఎపిలెప్సీని కలిగించవచ్చు.
- డెమెన్షియా(మనోభ్రంశము) – పెద్ద వయసు ఉన్న వాళ్ళలో జ్ఞాపక శక్తి కోల్పోవడం
- మెదడు ఇన్ఫెక్షన్లు – మెనింజైటిస్ మెదడులో లేదా వెన్నుపూసలో ఇన్ఫెక్షన్‌ను మరియు శోధను కలిగించవచ్చు
- బాల్యంలో మూర్ఛలు – పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చే తీవ్ర జ్వరాలు కొన్నిసార్లు మూర్ఛలతో వస్తాయి
ఎపిలెప్సీ రోగ నిర్ధారణ
డాక్టర్ ఈ క్రింది వాటిని నిర్వహిస్తారు:
- రోగి వైద్య చరిత్ర – సంకేతాలు, లక్షణాలతో పాటు వైద్య చరిత్రను సమీక్షిస్తారు
- న్యూరోలాజికల్ పరీక్షలు మరియు న్యూరోసైకోలాజికల్ పరీక్షలు – ప్రవర్తనను పరిశీలిస్తారు, ఎపిలెప్సీని అంచనా వేయడంతో పాటు మెదడు లోని ఏ ప్రాంతం ప్రభావితం చెందిందో కనుగొనడానికి, ఆలోచనా శక్తిని, జ్ఞాపక శక్తి, మాట్లాడే నైపుణ్యాలు, మోటార్ సామర్థ్యాలు మరియు మానసిక క్రియాశీలతను మదింపు చేస్తారు
- రక్త పరీక్షలు – మూర్ఛలతో ముడిపడి ఉన్న ఇన్ఫెక్షన్లు, జన్యు స్థితులను పరిశీలించడానికి
- స్కాన్లు –మెదడు అసాధారణతలతో పాటు మూర్ఛ కేంద్రాన్ని గుర్తించడానికి డాక్టర్లు CT స్కాన్, MRI, PET స్కాన్, SPECT పరీక్ష మరియు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) పరీక్షలను నిర్వహించవచ్చు.
ఎపిలెప్సీ చికిత్స
డాక్టర్లు సాధారణంగా మూర్ఛకు మందులతో చికిత్స చేస్తారు. మందుల ద్వారా పరిస్థితికి మెరుగుపడకపోతే, వైద్యులు శస్త్రచికిత్స లేదా వాగస్ నర్వ్ స్టిమ్యులేషన్ వంటి థెరపీలను మరియు కీటోజెనిక్ ఆహారం వంటి చికిత్సలను ప్రతిపాదించవచ్చు.