BPH (విస్తరించిన ప్రోస్టేట్) నిర్వచనం
BPH అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా. బినైన్ అంటే “క్యాన్సర్ కాదు,” అని అర్థం మరియు హైపర్‌ప్లాసియా అంటే అధికంగా పెరగటం. ఫలితంగా ప్రోస్టేట్ పెద్దదిగా అవుతుంది. BPH క్యాన్సర్‌తో ముడిపడి ఉండదు, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచదు – అయినప్పటికీ BPH, ప్రోస్టేట్ క్యాన్సర్‌ల లక్షణాలు ఒకే విధంగా ఉండవచ్చు.
BPH (పెరిగిన ప్రోస్టేట్ గ్రంధి) లక్షణాలు
BPH లక్షణాలు సాధారణంగా 50 ఏళ్ల తర్వాత ప్రారంభమవుతాయి. వాటిలో ఇవి ఉంటాయి:
- మూత్ర ప్రవాహాన్ని ప్రారంభించడంలో సమస్య లేదా మూత్రం చుక్కలు చుక్కలుగా రావడం
- తరచుగా మూత్ర విసర్జన, ముఖ్యంగా రాత్రిపూట
- మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదనే భావన
- మూత్ర విసర్జన చేయాలనే బలమైన లేదా ఆకస్మిక కోరిక
- మూత్ర విసర్జన మందగించడం లేదా నెమ్మదిగా చేయడం
- మూత్ర విసర్జన సమయంలో అనేక సార్లు మూత్ర ప్రవాహం ఆగి మళ్లీ ప్రారంభం కావడం
- మూత్ర విసర్జన ప్రారంభించడానికి ముక్కాల్సి రావడం లేదా కష్టపడాల్సి రావడం
దుర్భర పరిస్థితుల్లో, BPH ఈ క్రింది వాటికి దారితీయవచ్చు:
- బలహీనమైన మూత్రాశయం
- మూత్రం వెనుకకు ప్రవహించి మూత్రాశయం లేదా మూత్ర పిండాల ఇన్ఫెక్షన్లకు కారణమవ్వడం
- మూత్ర ప్రవాహాన్ని పూర్తి అవరోధం ఏర్పడటం
- మూత్ర పిండాల వైఫల్యం
BPH చాలా మంది పురుషులను వృద్ధాప్యంలో ప్రభావితం చేస్తుంది. ఇది ప్రొస్టటైటిస్ వంటి మూత్ర సమస్యలకు దారితీస్తుంది. 60 సంవత్సరాల వయస్సులో, చాలా మంది పురుషులు BPH సంకేతాలను కలిగి ఉంటారు. 70 సంవత్సరాల వయస్సులో, దాదాపు పురుషులు అందరికీ ప్రోస్టేట్ వ్యాకోచం జరుగుతుంది. ప్రోస్టేట్ వాల్‌నట్ పరిమాణంలో ప్రారంభమవుతుంది. మనిషికి 40 ఏళ్లు వచ్చేసరికి, అది కాస్త పెద్దగా అయి, ఆప్రికాట్ పరిమాణంలోనికి పెరుగుతుంది. 60 సంవత్సరాల వయస్సులో, ఇది నిమ్మకాయ పరిమాణంలో ఉండవచ్చు.
వృద్ధాప్యంలో సాధారణ భాగంగా, ప్రోస్టేట్ వ్యాకోచించి మూత్రాశయం మరియు ప్రసేకానికి నొక్కుకుపోతుంది. ఇది మూత్ర ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది లేదా నిరోధించవచ్చు. కొంతమంది పురుషులకు మూత్ర ప్రవాహాన్ని ప్రారంభించడం కష్టంగా అనిపించవచ్చు, అయినప్పటికీ వారికి మూత్రానికి వెళ్ళవలసిన అవసరం ఉందని భావన కలుగుతుంది. మూత్ర విసర్జన ప్రారంభమైన తర్వాత, దానిని ఆపడం కష్టం కావచ్చు. ఇతర పురుషులకు అన్ని సమయాలలో మూత్ర విసర్జన చేయాలని భావన కలుగవచ్చు లేదా అకస్మాత్తుగా మూత్ర విసర్జన చేయాలనిపించి నిద్రలో మెళకువ రావచ్చు.
ప్రారంభ BPH లక్షణాలు ఇబ్బందికరమైన సమస్యలుగా మారడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రారంభ లక్షణాలు మీ డాక్టర్‌ను సందర్శించడానికి ఒక సూచన.
సాధారణ (ఎడమ), వ్యాకోచించిన ప్రోస్టేట్ (కుడి) యొక్క మూత్ర ప్రవాహం. ఎడమవైపు ఉన్న పటంలో మూత్రం స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. కుడి వైపున, మూత్రాశయం మరియు మూత్రనాళంపై ప్రోస్టేట్ నొక్కుకుపోవడం వల్ల మూత్రం ప్రవాఅహం మందగిస్తుంది.
BPH (వ్యాకోచించిన ప్రోస్టేట్) చికిత్స
BPH ఉన్న దాదాపు సగం మంది పురుషులు ఆఖరుకి చికిత్స అవసరమయ్యేంత ఇబ్బంది కలిగించే లక్షణాలను కలిగి ఉంటారు. BPH నయం కాదు, కానీ మందులు లేదా శస్త్రచికిత్స ద్వారా తరచుగా దాని లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. BPH లక్షణాలు అన్ని సందర్భాలలో అధ్వాన్నంగా పెరగవు.
BPHని నిర్వహించడానికి మూడు మార్గాలు ఉన్నాయి:
- జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి (మీ డాక్టర్ సలహాలు, సూచనలు క్రమంగా తీసుకుంటుండాలి)
- ఔషధ చికిత్స
- సర్జరీ
మీకు ఉత్తమంగా సరిపోయే ఎంపిక గురించి మీ డాక్టర్‌తో మాట్లాడండి. మీ లక్షణాలు కాలక్రమేణా మారవచ్చు, కాబట్టి ఏదైనా కొత్త మార్పుల గురించి మీ డాక్టర్‌తో చెప్పండి.
జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండటం
BPH యొక్క తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న పురుషులు తరచుగా ఈ విధానాన్ని ఎంచుకుంటారు. చెకప్‌లలో DREలు మరియు ఇతర పరీక్షలు ఉంటాయి (“పరీక్షల రకాలు” చూడండి). లక్షణాలు తీవ్ర సమస్యగా మారితే మాత్రమే చికిత్స ప్రారంభించబడుతుంది. మీరు లక్షణాలతో జీవించాలని ఎంచుకుంటే, ఈ సాధారణ దశలు సహాయపడతాయి:
- సాయంత్రం మద్యపానాన్ని, ముఖ్యంగా ఆల్కహాల్ లేదా కెఫిన్ ఉన్న పానీయాలను పరిమితం చేయండి,.
- మీరు మూత్ర విసర్జన చేసినప్పుడు మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయండి.
- తరచుగా మరుగుదొడ్లను ఉపయోగించండి. మూత్ర విసర్జన చేయకుండా ఎక్కువసేపు ఉండకండి.
ఔషధ చికిత్స
ప్రధానంగా రెండు రకాల మందులు వాడుకలో ఉన్నాయి. ఒక రకం మందు ప్రోస్టేట్ దగ్గర కండరాలను సడలిస్తుంది, మరొక రకం ప్రోస్టేట్ గ్రంధిని తగ్గిస్తుంది. BPH లక్షణాలు అధ్వాన్నం కాకుండా ఉండటానికి రెండు ఔషధాలను కలిపి తీసుకోవడం ఉత్తమంగా పని చేస్తుందని చూపించే ఆధారాలు ఉన్నాయి.
BPH సర్జరీ
గత కొన్ని సంవత్సరాలుగా ప్రోస్టేట్ శస్త్రచికిత్సల సంఖ్య తగ్గింది. కానీ BPH కోసం ఆపరేషన్లు ఇప్పటికీ అమెరికన్ పురుషులకు అత్యంత సాధారణ శస్త్రచికిత్సలలో ఒకటి. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు లేదా ఔషధ చికిత్స బాగా పని చేయనప్పుడు శస్త్రచికిత్స ఉపయోగించబడుతుంది.
శస్త్రచికిత్సలలోని రకాలు:
- TURP (ప్రోస్టేట్ యొక్క ట్రాన్స్‌యురేత్రల్ రీసెక్షన్) అనేది BPH కోసం చేసే అత్యంత సాధారణ శస్త్రచికిత్స. ఇది మొత్తం BPH శస్త్రచికిత్సలలో 90 శాతం. వైద్యుడు మూత్రనాళం ద్వారా ఒక పరికరాన్ని పంపి, అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని ట్రిమ్ చేస్తారు. ఆ ప్రాంతాన్ని మొద్దుబారడానికి స్పైనల్ బ్లాక్ ఉపయోగిస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను పరిశీలించడానికి కణజాలాన్ని ప్రయోగశాలకు పంపిస్తారు. TURP సాధారణంగా ఇతర ప్రోస్టేట్ శస్త్రచికిత్సలతో ముడిపడి ఉన్న మూత్రం ఆపుకొనలేని స్థితి మరియు నపుంసకత్వము (అంగస్తంభన కలిగి ఉండకపోవడం) అనే రెండు ప్రధాన ప్రమాదాలను నివారిస్తుంది, TURP నుండి కోలుకునే కాలం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
- TUIP (ప్రోస్టేట్ యొక్క ట్రాన్స్‌యురేత్రల్ కోత(ఇన్‌సిషన్)) కూడా TURPను పోలి ఉంటుంది. ఇది కొద్దిగా పెద్దవైన ప్రోస్టేట్ గ్రంధులపై ఉపయోగించబడుతుంది. శస్త్ర చికిత్సను నిర్వహించే సర్జన్ ప్రోస్టేట్‌కు ఒకటి లేదా రెండు చిన్న కోతలను వేస్తారు. ఇది కణజాలాన్ని కత్తిరించాల్సిన అవసరం లేకుండగానే ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనికి తక్కువ దుష్ప్రభావాలు ఉంటాయి. TURP వలె, ఈ చికిత్స మూత్ర నాళాన్ని విస్తరించడం ద్వారా మూత్ర ప్రవాహానికి సహాయపడుతుంది.
- TUNA (ట్రాన్స్‌యురేత్రల్ నీడిల్ అబ్లేషన్) రేడియో తరంగాలను ఉపయోగించి అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని కాల్చివేస్తుంది. ఇది మూత్ర ప్రవాహానికి సహాయపడుతుంది, లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు TURP కంటే తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. చాలా మంది పురుషులకు ఈ ప్రక్రియ తర్వాత కొంత సమయం వరకు మూత్రం పోయడానికి కాథెటర్ అవసరం అవుతుంది.
- TUMT (ట్రాన్స్‌యురేత్రల్ మైక్రోవేవ్ థర్మోథెరపీ) అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని నాశనం చేయడానికి కాథెటర్ ద్వారా పంపబడిన మైక్రోవేవ్‌లను ఉపయోగిస్తుంది. ఇతర వైద్య సమస్యలు ఉన్నందున పెద్ద శస్త్రచికిత్స చేయకూడని పురుషులకు ఇది ఒక ప్రత్యామ్నాయం.
- TUVP ( ప్రోస్టేట్ యొక్క ట్రాన్స్‌యురేత్రల్ ఎలెక్ట్రోవాపరేషన్ ) ప్రోస్టేట్ కణజాలాన్ని ఆవిరి చేయడానికి విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగిస్తుంది.
- ఓపెన్ ప్రోస్టేటెక్టమీ అంటే సర్జన్ పొత్తికడుపులో కోత ద్వారా ప్రోస్టేట్‌ను తొలగిస్తాడు. అడ్డంకులు తీవ్రంగా ఉన్నప్పుడు, ప్రోస్టేట్ చాలా పెద్దగా ఉన్నప్పుడు లేదా ఇతర విధానాలు చేయలేనప్పుడు ఇది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇది చేయబడుతుంది. ఈ ప్రక్రియలో సాధారణ లేదా వెన్నెముక అనస్థీషియా ఉపయోగిస్తారు, శస్త్రచికిత్స తర్వాత 3 నుండి 7 రోజుల వరకు కాథెటర్ ఉంటుంది. వైద్య చికిత్స కంటే ఈ సర్జరీ వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను పరిశీలించడానికి కణజాలం ప్రయోగశాలకు పంపబడుతుంది.
యూరాలజికల్ పరిస్థితులకు మా చికిత్సల గురించి మరింత చదవండి ఇక్కడ క్లిక్ చేయండి