డిప్రెషన్ నిర్వచనం
కొన్నిసార్లు ప్రజలు విచారంగా ఉన్నప్పుడు, వారు “డిప్రెషన్‌లో ఉన్నారు” అని అంటుంటారు. కానీ డిప్రెషన్ అంటే కేవలం విచార పడటం కాదు కానీ అంతకు మించి. ఇదొక వైద్య రుగ్మత. “మేజర్” డిప్రెషన్ ఉన్న వ్యక్తులు దాదాపు ప్రతిరోజూ, రోజంతా, 2 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్రింద జాబితా చేసిన చాలా వరకు లేదా అన్ని లక్షణాలను కలిగి ఉంటారు.
డిప్రెషన్ లక్షణాలు
- మీరు ఇదివరకు ఆస్వాదించిన వాటిపై ప్రస్తుతం ఆసక్తిని కోల్పోవడం, ఆస్వాదించలేకపోవడం
- విచారంగా, నిస్తేజంగా అనిపించడం
- ఏ కారణం లేకుండా ఏడవటం
- నెమ్మదించినట్లుగా లేదా విసుకుగా, చిరాకుగా ఉండటం
- వారికి వారే విలువ లేనట్లు భావించడం లేదా అపరాధ భావంతో ఉండటం
- ఆకలిలో మార్పులు; అవాంఛితంగా బరువు పెరగడం
- గతంలో వాటిని గుర్తుకు తెచ్చుకోవడంలో, ఏకాగ్రత కలిగి ఉండటం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం
- తలనొప్పి, వెన్ను నొప్పి లేదా జీర్ణాశయ సమస్యలు రావడం
- నిద్ర సమస్యలు లేదా ఎప్పుడూ నిద్రపోవాలని అనిపించడం
- ఎప్పుడూ అలిసిపోయినట్లు ఉండటం
- చావు, ఆత్మహత్యల గురించిన ఆలోచనలు
డిప్రెషన్‌కు కారణాలు
మీ శరీరంలో మీ మూడ్స్‌ను నియంత్రించడంలో సహాయపడే రసాయనాలు ఉంటాయి. మీలో ఈ రసాయనాలు తగినంత పాళ్ళలో లేనప్పుడు, మీ మెదడు వాటికి సరిగ్గా స్పందించనప్పుడు డిప్రెషన్‌కు గురవుతారు. డిప్రెషన్ జన్యుపరమైనది కావచ్చు (అంటే అది కుటుంబాలలో ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగుతుంది). చెడు మాదక ద్రవ్యాలు లేదా ఆల్కహాల్ సేవనం కూడా డిప్రెషన్‌కు దారి తీస్తుంది. కొన్ని వైద్య సమస్యలు మరియు మందులు డిప్రెషన్‌కు దారితీస్తాయి.
డిప్రెషన్ అనేది వయసు పెరుగుతున్న కొలదీ సంక్రమించే సాధారణ రుగ్మత కాదు, కానీ 65 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో సైతం ఇది సాధారణం అయిపోయింది. పదవీ విరమణ, ఆరోగ్య సమస్యలు, ప్రియమైన వారిని కోల్పోవడం వంటివి వృద్ధుల జీవితాలలో జరిగే విషయాలు. ఇలాంటి సందర్భాలలో విచార పడటం సాధారణం. కానీ ఈ విచార భావనలు అలాగే కొనసాగి, మీ సాధారణ కార్యకలాపాలను చేయలేకపోతుంటే, మీరు మీ డాక్టర్‌ను సంప్రదించాలి.
పెద్ద వయస్కులైన వారిలోని కృంగుబాటును గుర్తించడం ఎందుకు కష్టం?
డిప్రెషన్ మరియు
డెమెన్షియా వంటి అనారోగ్యాల మధ్య వ్యత్యాసాన్ని చెప్పడం కష్టం. అలాగే, పెద్దలు ఇబ్బందిగా భావిస్తారు కాబట్టి వారి విచారాన్ని, కలతను గురించి వారి వైద్యునితో చెప్పలేకపోవచ్చు. కానీ డిప్రెషన్ అంటే చెప్పుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అంశం కాదు. ఇది వ్యక్తిగత బలహీనత కాదు. ఇది చికిత్స చేయగలిగే వైద్య రుగ్మత.
డిప్రెషన్‌ను నిర్ధారించడం
కొన్నిసార్లు డిప్రెషన్‌ని మొదట స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. మీ డిప్రెషన్ లక్షణాలు ఉంటే, మీ డాక్టర్‌కు తెలియజేయండి. మిమ్మల్ని చూడగానే మీరు డిప్రెషన్లో ఉన్నట్లు మీ చుట్టు ప్రక్కల వ్యక్తులు గుర్తుపడతారని అనుకోకండి. మీ డాక్టర్ మీ లక్షణాలు, మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్య సమస్యల చరిత్ర గురించి ప్రశ్నలు అడుగుతారు. వారు మిమ్మల్ని పరిశీలించి కొన్ని పరీక్షలు నిర్వహించవచ్చు. మీరు ఏవైనా మందులు తీసుకుంటుంటే వాటి గురించి మీ డాక్టర్‌కు చెప్పడం కూడా చాలా ముఖ్యం.
డిప్రెషన్ చికిత్స
డిప్రెషన్‌ను మందులతో లేదా కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా, లేదా రెండింటితో అదుపు చేయవచ్చు. ఈ చికిత్సలు చాలా ప్రభావశీలకమైనవి. తీవ్రమైన డిప్రెషన్‌కు మందులు వాడటం చాలా ముఖ్యం. మీకు సరైన చికిత్స గురించి మీ డాక్టర్‌తో మాట్లాడండి.
నా డాక్టర్ ఏదైనా మందులు రాస్తే ఏమి చేయాలి?
డిప్రెషన్ చికిత్సకు ఉపయోగించే మందులను యాంటిడిప్రెసెంట్స్ అంటారు. అవి మీ మెదడులోని డిప్రెషన్‌కు కారణమయ్యే రసాయన అసమతుల్యతను సరిచేస్తాయి. ఈ మందులు సాధారణంగా చాలా బాగా పని చేస్తాయి, కానీ అవి కొన్ని సార్లు, కొన్ని దుష్ప్రభావాలను కలిగించవచ్చు. దుష్ప్రభావాలు సాధారణంగా కాలక్రమేణా తగ్గిపోతాయి. యాంటిడిప్రెసెంట్స్, మీరు వాటిని తీసుకున్న వెంటనే పని చేయడం ప్రారంభించవచ్చు, కానీ మీరు పూర్తి ప్రయోజనం చూడడానికి 6 నుండి 8 వారాలు పట్టవచ్చు. ముందుగా మీ డాక్టర్‌ను సంప్రదించకుండా ఔషధం తీసుకోవడం ఆపవద్దు.