సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images
అపోలో హాస్పిటల్స్లివర్ సిరోసిస్

లివర్ సిరోసిస్

లివర్ సిరోసిస్ నిర్వచనం

సిరోసిస్ అనేది కాలేయానికి మచ్చలు లేదా ఫైబ్రోసిస్ ఏరడటం యొక్క ముదిరిన దశ, ఇది సాధారణంగా ఇప్పటికే ఉన్న హెపటైటిస్ లేదా మద్యపాన వ్యసనం వంటి పరిస్థితి కారణంగా కాలేయం దెబ్బతిన్నట్లయితే సంభవిస్తుంది.

కాలేయానికి సిరోసిస్ కలిగించే నష్టం చాలా విస్తృతమైనది మరియు కోలుకోలేనిది. అయితే సరైన చికిత్స మరియు మందులతో, మనం మరింత నష్టం జరుగకుండా అరికట్టవచ్చు.

లివర్ సిరోసిస్ లక్షణాలు

సిరోసిస్ యొక్క లక్షణాలు తరచూ అంత గుర్తించగలిగేవిగా ఉండవు, ఇవి కాలేయం ఏ మేరకు దెబ్బతిన్నది అనే దానిపై చాలా వరకు ఆధారపడి ఉంటాయి. అయితే, అత్యంత గుర్తించదగిన లక్షణాలలో ఈ క్రిందివి ఉంటాయి:

  •         దురద చర్మము
  •         చాలా సులభంగా గాయాలు మరియు రక్తస్రావం కావడం
  •         అలసట
  •       పసుపు రంగుకు మారడం లేదా కామెర్లు
  •         పొత్తికడుపులో ద్రవం చేరడం
  •         బరువు తగ్గడం
  •         ఉబ్బిన కాళ్లు
  •         ఆకలి లేకపోవడం
  •         చర్మంపై సాలీడు లాంటి రక్తనాళాలు
  •         వికారం

లివర్ సిరోసిస్ ప్రమాద కారకాలు

లివర్ సిరోసిస్‌కు అనేక అంశాలు కారణమవుతాయి. వీటిలో ఇవి ఉండవచ్చు:

  •         సిస్టిక్ ఫైబ్రోసిస్
  •         శరీరంలో ఐరన్ పేరుకుపోవుట
  •         విల్సన్ వ్యాధి
  •         ఆటో ఇమ్యూన్ హెపటైటిస్
  •         జన్యు సంబంధ జీర్ణ రుగ్మత
  •         గెలాక్టోసెమియా
  •         పేలవంగా ఏర్పడిన పిత్త వాహికలు
  •         అధిక మద్య సేవనం
  •         హెపటైటిస్ బి మరియు సి
  •         కాలేయంలో కొవ్వు పేరుకుపోవుట

లివర్ సిరోసిస్ నిర్ధారణ

సిర్రోసిస్ యొక్క మొదటి దశను సాధారణంగా సాధారణ రక్త పరీక్షల ద్వారా కనుగొనవచ్చు. మీకు నిజానికి సిరోసిస్ ఉందని డాక్టర్ అనుమానించినట్లయితే, అతను కాలేయ పనితీరు, మూత్రపిండాల పనితీరు, హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి మరియు గడ్డకట్టే పరీక్షలను సిఫారసు చేయవచ్చు.

సూచించబడే ఇతర పరీక్షలు:

  •         CT స్కాన్
  •         అల్ట్రాసౌండ్
  •         రేడియో ఐసోటోప్ కాలేయం/ప్లీహము స్కాన్
  •         బయాప్సీ

లివర్ సిరోసిస్ సమస్యలు

  •         వేరికేయల్ రక్తస్రావం. ఇది పోర్టల్ హైపర్‌టెన్షన్ కారణంగా జరుగుతుంది,ఇందులో పోర్టల్ సిరలో ఒత్తిడి పెరుగుతుంది (జీర్ణ అవయవాలను కాలేయానికి అనుసంధానించే రక్తనాళం). ఈ వేరికేస్‌లు సులభంగా రక్తస్రావం అవుతాయి, దీని వలన తీవ్రమైన రక్తస్రావం మరియు పొత్తికడుపులో ద్రవం ఏర్పడుతుంది.
  •         గందరగోళ ఆలోచన మరియు ఇతర మానసిక మార్పులు (హెపాటిక్ ఎన్సెఫలోపతి). మన శరీరంలోకి చేరిన విషతుల్య పదార్ధాలు సాధారణంగా కాలేయం ద్వారా తొలగించబడతాయి, కానీ సిరోసిస్ సంభవించినప్పుడు, కాలేయం కూడా విషాన్ని తొలగించలేదు. కాబట్టి అవి రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి మరియు గందరగోళం, ప్రవర్తనలో మార్పులు మరియు కోమాకు వెళ్ళడానికి కూడా కారణమవుతాయి.

లివర్ సిరోసిస్ చికిత్స

సిరోసిస్ వల్ల కలిగే నష్టాన్ని బట్టి, మీరు కేవలం కొన్ని జీవనశైలి సర్దుబాట్లు చేయడం ద్వారా లేదా మందుల ద్వారా లేదా రెండింటి ద్వారా మెరుగుపడవచ్చు.

జీవనశైలి సర్దుబాటు ద్వారా చికిత్స

ఇంతకుముందు ఆల్కహాల్ ఎక్కువగా సేవించే అలవాటున్న వ్యక్తులలో సిరోసిస్ తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ సందర్భంలో, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. అటువంటి వ్యసనం నుండి ఎలా పునరావాసం పొందాలో వైద్య సలహా కూడా పొందవచ్చు.

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడేవారు బరువు తగ్గడంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని అదుపు చేసుకుంటే పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు. ఒక వ్యక్తికి హెపటైటిస్ ఉంటే, కాలేయ కణాల గాయాన్ని తగ్గించడానికి స్టెరాయిడ్లు లేదా యాంటీవైరల్ మందులు ఇవ్వబడతాయి.

లివర్ సిరోసిస్ చికిత్స

లివర్ సిరోసిస్ లక్షణాలను నియంత్రించడానికి మందులు ఇవ్వవచ్చు . అదనపు ద్రవాన్ని తొలగించడానికి మరియు ఎడెమా పునరావృతం కాకుండా నిరోధించడానికి డైయురెటిక్స్‌ను ఉపయోగిస్తారు. మారిన మానసిక పనితీరుకు ఆహారం మరియు ఔషధాల ద్వారా చికిత్స చేయవచ్చు. లాక్టులోజ్ వంటి భేదిమందులు టాక్సిన్స్‌ను శోషించడానికి మరియు ప్రేగుల నుండి త్వరగా తొలగించడానికి సహాయపడతాయి.

కొన్ని సందర్భాల్లో కాలేయ మార్పిడి అవసరం కావచ్చు.

Popular Searches
Telephone Call Icon Call Us Now +91 8069991061 Book Health Check-up Book Appointment

Request A Call Back

Close