సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images

కాలేయ మార్పిడిని అర్థం చేసుకోవడం

కాలేయ మార్పిడిని అర్థం చేసుకోవడం

కాలేయం ఒక ముఖ్యమైన అవయవం, ఇది జీర్ణవ్యవస్థ నుండి వచ్చే రక్తాన్ని శరీరంలోని మిగిలిన భాగాలకు పంపించే ముందు ఫిల్టర్ చేస్తుంది. ఇది రసాయనాలను నిర్విషీకరణ చేస్తుంది, ఔషధాలను జీవక్రియకు లోనయ్యేలా చేస్తుంది మరియు కండరాలను నిర్మించడానికి, ఇన్ఫెక్షన్లతో మరియు రక్తం గడ్డకట్టడంతో పోరాడటానికి అవసరమైన ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది.

కాలేయ మార్పిడి అంటే ఏమిటి మరియు అది ఎప్పుడు అవసరం?

లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది వ్యాధిగ్రస్థమైన కాలేయాన్ని తీసివేసి, దాని స్థానంలో ఆరోగ్యకరమైనదానిని అమర్చే శస్త్రచికిత్స. కాలేయం ఇక తగినంతగా పనిచేయనప్పుడు (కాలేయం వైఫల్యం) కాలేయ మార్పిడి చేయాల్సి వస్తుంది. పెద్దలలో, కాలేయ మార్పిడికి అత్యంత సాధారణ కారణం సిర్రోసిస్ కాగా పిల్లలలో బిలియరీ అట్రేసియాగా ఉంది. దీనికి కారణమయ్యే ఇతర పరిస్థితులలో వైరల్ హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ మరియు వంశపారంపర్య వ్యాధులు ఉన్నాయి.

ట్రాన్స్‌ప్లాంట్ బృందం

కాలేయ మార్పిడి సరైనదో కాదో నిర్ధారించడానికి వివిధ రంగాలకు చెందిన నిపుణులు అవసరం. బృందంలో ఈ క్రింది వారు ఉంటారు:

  •         కాలేయ నిపుణుడు ( హెపటాలజిస్ట్ )
  •         ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు
  •         ట్రాన్స్‌ప్లాంట్ సమన్వయకర్త
  •         పోషకాహార నిపుణుడు( న్యూట్రీషియనిస్ట్)
  •         ఫిజియోథెరపిస్ట్
  •         మానసిక వైద్యుడు
  •         అనస్థీషియాలజిస్ట్

కాలేయ మార్పిడికి ఆదర్శప్రాయ ఆసుపత్రిలో ఉండాల్సినవి

  •         శస్త్రచికిత్సకు ఖచ్చితమైన అసెప్టిక్ చర్యలు అవసరమవుతాయి, అందువల్ల లామినార్ ఫ్లోతో ప్రత్యేక OT సౌకర్యాలు ఉండాలి.
  •         కాలేయ శస్త్రచికిత్సకు 640 స్లైస్ CECT యాంజియోగ్రఫీ మరియు వాల్యూమెట్రీ, ఆర్గాన్ బీమ్ వంటి అత్యాధునిక సాంకేతికత అవసరం, వీటిని CUSA మరియు Water JetTM వంటి కాలేయ విచ్ఛేదన సాధనాలతో కలిపి ఉపయోగిస్తారు.
  •         24 గంటలూ బ్లడ్ బ్యాంక్ సదుపాయం అందుబాటులో ఉండాలి
  •         కాలేయ మార్పిడి రోగుల పరిశోధన కోసం ప్రత్యేక పాథాలజీ మరియు ఇమ్యునాలజీ సౌకర్యాలు – దాతలు మరియు గ్రహీతలు ఇద్దరికీ.
  •         ప్రత్యేక హెపాటోబిలియరీ క్రిటికల్ కేర్ యూనిట్, పిలవగానే అందుబాటులో ఉండేలా హెపాటోబిలియరీ వైద్యుడు, అనస్థీషియా సిబ్బంది మరియు ప్రత్యేక నర్సింగ్ బృందం ఉండాలి.

కాలేయ మార్పిడి శస్త్రచికిత్స

లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఆరోగ్యంగా ఉన్న సజీవ దాత నుండి కాలేయ భాగాన్ని తీసి, దానిని గ్రహీతకు అమర్చడం. కాలేయం యొక్క గణనీయమైన ఫంక్షనల్ రిజర్వ్ సామర్థ్యం (70%) మరియు పునరుత్పత్తి చేసే అద్భుతమైన సామర్థ్యం కారణంగా ఇది సాధ్యమవుతుంది. దాత మరియు గ్రహీతల కాలేయ భాగాలు కొన్ని వారాల్లో సాధారణ పరిమాణానికి పెరుగుతాయి.

మరణించిన దాత కాలేయ మార్పిడిలో, దాత ఒక రోగియై ఉండి, అతని మెదడు శాశ్వతంగా మరియు కోలుకోలేని విధంగా పనిచేయడం మానేస్తుంది. ఈ పరిస్థితుల్లో కాలేయం ఇతర అవయవాలతో పాటు, బంధువుల సమ్మతితో దానం చేయబడుతుంది.

కాలేయ మార్పిడి ఆపరేషన్ సాధారణంగా 6 నుండి 10 గంటలు పడుతుంది. వ్యాధిగ్రస్థ కాలేయాన్ని తొలగించి, దాత కాలేయంతో భర్తీ చేస్తారు. కొత్త కాలేయాన్ని అమర్చడానికి ముందు సర్జన్ వ్యాధిగ్రస్థ కాలేయాన్ని పిత్త వాహికలు మరియు రక్త నాళాల నుండి వేరు చేస్తారు.

మార్పిడి తర్వాత ఆసుపత్రిలో మరియు ఇంటిలో తీసుకునే తదుపరి సంరక్షణలో సాధారణ పనితీరును నిర్ధారించడానికి మరియు మార్పిడి చేసిన అవయవం తిరస్కరణకు గురికాకుండా నిరోధించడానికి మందులను ఉపయోగించడం ఉంటుంది. విజయవంతమైన కాలేయ మార్పిడి తర్వాత రోగులు సాధారణంగా వారి పని, సామాజిక మరియు కుటుంబ జీవితాలకు తిరిగి వస్తారు.

Telephone Call Icon Call Us Now +91 8069991061 Book Health Check-up Book Appointment

Request A Call Back

Close