సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images
అపోలో హాస్పిటల్స్DepartmentsTransplantationట్రాన్స్‌ప్లాంట్లు అంటే‌-సులభంగా అర్థమయ్యేలాప్యాంక్రియాస్ మార్పిడి – మధుమేహాన్ని జయించే కొత్త ఆయుధం!

ప్యాంక్రియాస్ మార్పిడి – మధుమేహాన్ని జయించే కొత్త ఆయుధం!

ప్యాంక్రియాస్ మార్పిడి – మధుమేహాన్ని జయించే కొత్త ఆయుధం!

ప్యాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయని వ్యక్తికి దాత నుండి ఆరోగ్యకరమైన ప్యాంక్రియాస్‌ను అమర్చడానికి చేసే శస్త్రచికిత్స. సాధారణంగా, ప్యాంక్రియాస్ మనం తినే ఆహారం నుండి చక్కెర మరియు కొవ్వును నిల్వ చేయడానికి మరియు ఉపయోగించడంలో శరీరానికి సహాయం చేయడానికి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ప్యాంక్రియాస్ తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసినప్పుడు లేదా అసలు లేనప్పుడు మధుమేహం వస్తుంది. మధుమేహానికి జీవనశైలి మందులు, జీవితకాల మందులు మరియు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్ప ఖచ్చితమైన నివారణ లేదు.

ప్యాంక్రియాటిక్ మార్పిడి అనేది సముచితంగా ఎంపిక చేయబడిన రోగులలో మధుమేహానికి అందుబాటులో ఉన్న ఏకైక నివారణ. ప్యాంక్రియాస్ మార్పిడి మధుమేహ రోగుల మనుగడకు గణనీయమైన తోడ్పాటును అందిస్తుంది, లేకపోతే వారి ఆయుర్దాయం సాధారణం కంటే మూడింట ఒక వంతు తగ్గిపోతుంది.

అవయవం పనిచేయకపోయే వరకు వేచి ఉండకుండా, మధుమేహం వల్ల అవయవ నష్టం జరుగుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపించిన మొదట్లోనే, ఈ మార్పిడిని ముందస్తుగా చేసినప్పుడు, రోగి మనుగడలో గణనీయమైన ప్రయోజనం కనిపిస్తుంది. టైప్ 1 మధుమేహం మరియు టైప్ 2మధుమేహం కోసం కొన్ని నిర్దిష్ట వైద్య పరిస్థితులలో పరిగణనలోకి తీసుకున్నప్పుడు విలువైనది ప్యాంక్రియాస్ మార్పిడి విలువైనదిగా ఎంచబడవచ్చు.

ప్యాంక్రియాటిక్ మార్పిడి రకాలు

తీవ్రమైన టైప్ 1 మధుమేహం తరచూ దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యానికి దారితీస్తుంది. ఫలితంగా, ప్యాంక్రియాస్ మార్పిడి అవసరమయ్యే వ్యక్తికి కిడ్నీ మార్పిడి కూడా అవసరం కావచ్చు.

ప్యాంక్రియాస్ మార్పిడి మూడు రూపాల్లో జరుగుతుంది:

  •         ఏకకాల ప్యాంక్రియాస్- కిడ్నీ మార్పిడి: డయాలసిస్‌పై ఉన్న లేదా డయాలసిస్‌కు సమీపిస్తున్న మధుమేహ రోగులకు ఉద్దేశించబడింది.
  •         మూత్రపిండ మార్పిడి తర్వాత ప్యాంక్రియాస్ మార్పిడి: మూత్రపిండ మార్పిడి విజయవంతమైనప్పటికీ మధుమేహం నుండి సమస్యలు అలాగే కొనసాగుతున్న మధుమేహ రోగులకు ఉద్దేశించబడింది.
  •         ప్యాంక్రియాస్ మార్పిడి మాత్రమే: మధుమేహం సమస్యలతో బాధపడుతున్నప్పటికీ మూత్రపిండాల పనితీరు తగినంతగా ఉన్న రోగులకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించబడింది.

ప్యాంక్రియాస్ మార్పిడి కోసం మూల్యాంకనం

ప్యాంక్రియాస్ మార్పిడి కోసం వివిధ నైపుణ్యాలు కల వైద్యుల బృందం రోగిని అంచనా వేస్తుంది.

తగినట్లయితే, రోగిని వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచుతారు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మరియు పెద్ద శస్త్రచికిత్సకు ఆ వ్యక్తి అనుకూలతను పరిగణనలోకి తీసుకుంటారు. ముదిరిన క్యాన్సర్, TB వంటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు లేదా చాలా తీవ్రమైన గుండె, ఊపిరితిత్తులు లేదా కాలేయ వ్యాధి ఉన్న వ్యక్తులకు ప్యాంక్రియాస్ మార్పిడి నిర్వహించబడదు.

ప్యాంక్రియాస్ మార్పిడి శస్త్రచికిత్స

శస్త్రచికిత్స సమయంలో, దానంగా ఇచ్చిన ప్యాంక్రియాస్‌ను దాత నుండి వేరు చేసిన తర్వాత వీలైనంత త్వరగా స్వీకర్తకు మార్పిడి చేస్తారు. ప్యాంక్రియాస్ మార్పిడి సమయంలో రోగికి ఉన్న ప్యాంక్రియాస్ తొలగించబడదు, అయితే దానం చేసిన ప్యాంక్రియాస్ గ్రహీతకు ‘జోడించబడుతుంది’.

సరైన మందులు మరియు రెగ్యులర్ చెకప్‌లతో విజయవంతమైన ప్యాంక్రియాస్ మార్పిడి తర్వాత రోగులు సాధారణంగా వారి పని, సామాజిక మరియు కుటుంబ జీవితాలకు తిరిగి వస్తారు.

మధుమేహ నివారణ రేటు 10 సంవత్సరాలలో 80%గా ఉంది మరియు ఏకకాల మూత్రపిండ ప్యాంక్రియాస్ మార్పిడి తర్వాత 25 సంవత్సరాలలో మధుమేహ వ్యాధిగ్రస్థుడు సజీవంగా ఉండే అవకాశం 70% మరియు కేవలం మూత్రపిండ మార్పిడి విషయంలో 27%గా ఉంది. నిన్న మొన్నటి వరకు, ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఆధునిక వైద్యం యొక్క అద్భుతంగా పరిగణించబడింది. నేడు, ప్రతిభావంతులైన బృందాలు మరియు తాజా సాంకేతికతల సరైన మేళవింపుతో ప్రపంచ స్థాయి ఆసుపత్రులచే ఈ అద్భుతాలు ఎంతో సాధారణ ప్రాతిపదికన నిర్వహించబడుతున్నాయి.

Telephone Call Icon Call Us Now +91 8069991061 Book Health Check-up Book Appointment

Request A Call Back

Close