బహుళ అవయవ మార్పిడి ఆశకు కొత్త సరిహద్దు
ఒక యువకుడు పురోగమిస్తున్న కామెర్లు, ఉబ్బిన పొత్తికడుపు, అలసట మరియు ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. అతనికి పుట్టుకతోనే గుండె లోపం ఉండటంతో, అది గుండె వైఫల్యానికి దారితీసింది. ఇది గుండె మరియు కాలేయాన్ని కలిపే సిరలపై ఒత్తిడి పెరగడానికి కారణమైంది, ఇది కాలేయ వైఫల్యానికి దారితీసింది. రెండు ముఖ్యమైన అవయవాలు వైఫల్యం కావడంతో చికిత్సకు ఒక సవాలుగా మారింది, ఇక రెండు అవయవాలను కలిపి ఎన్-బ్లాక్ మార్పిడి చేయడమే ఏకైక పరిష్కారంగా ఉంది.
అవయవ మార్పిడి అనేది అత్యంత సవాలుతో కూడుకున్న అంశం మరియు నిరంతరం అభివృద్ధి చెందుతున్న సూపర్ స్పెషాలిటీలలో ఒకటి. బహుళ అవయవ మార్పిడి అనేది తదుపరి స్థాయి సాధన, ఇది శస్త్రచికిత్స నైపుణ్యం మరియు ఇంటర్ డిసిప్లినరీ వైద్య సంరక్షణ యొక్క సరికొత్త స్థాయిని సూచిస్తుంది. బహుళ అవయవ మార్పిడి అనేది శస్త్రచికిత్సా విన్యాసం, ఇది ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ అవయవ వ్యవస్థల మార్పిడిని కలిగి ఉంటుంది.
మార్పిడి చేయబడే వివిధ అవయవ మేళవింపులు:
- గుండె మరియు రెండు ఊపిరితిత్తులు
- గుండె మరియు మూత్రపిండాలి
- గుండె మరియు కాలేయం
- కాలేయం మరియు మూత్రపిండాలు
- ప్యాంక్రియాస్ మరియు మూత్రపిండం
- ఏకకాల కాలేయం, ప్యాంక్రియాస్ మరియు పేగు వంటి బహుళ విసెరల్ మార్పిడి
బహుళ అవయవ మార్పిడి ఎవరికి అవసరం?
ఒక అవయవం యొక్క దీర్ఘకాలిక వ్యాధి ఇతర అవయవ వ్యవస్థల వైఫల్యానికి దారి తీసే సందర్భంలో ఇది సాధారణంగా చికిత్స ఎంపికగా పరిగణించబడుతుంది. గుండె మరియు ఊపిరితిత్తులు భౌతికంగా మరియు క్రియాత్మకంగా సన్నిహితంగా అనుసంధానించబడి ఉన్నాయి. అందువల్ల,వీటిలో ఒకదాని వైఫల్యం మరొక దాని వైఫల్యానికి దారి తీస్తుంది. దెబ్బతిన్న ప్రాథమిక అవయవాన్ని మాత్రమే మార్చితే, రోగికి లక్షణాల నుండి ఉపశమనం ఉండకపోగా, బ్రతకకపోయే అవకాశం కూడా ఉంది.
ఈ రోజుల్లో, వెంట్రిక్యులర్ అసిస్ట్ పరికరాలు (స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక), కృత్రిమ ఊపిరితిత్తులు లేదా ECMO అని పిలువబడే ఉమ్మడి కృత్రిమ గుండె మరియు ఊపిరితిత్తుల వంటి అనేక రకాల పరికరాల సహాయంతో, ఈ రోగులు మార్పిడి కోసం వేచి ఉన్నప్పుడు వారిని నిలకడ స్థితికి తీసుకురావడానికి చాలా చేయవచ్చు. సాంకేతికంగా బహుళ అవయవ మార్పిడి అవసరత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ సమయం పడుతుంది, రోగులు సంక్లిష్ట పరిస్థితిలో ఉంటారు మరియు సంక్లిష్టత రేటు ఎక్కువగా ఉంటుంది.
ఈ క్రింది సదుపాయాలను కలిగి ఉన్న బాగా వ్యవస్థీకృత కేంద్రాల్లో బహుళ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఉత్తమంగా నిర్వహించబడతాయి:
- అనుభవం కల ట్రాన్స్‌ప్లాంట్ విభాగాలు (ఉదా. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, క్లోమం, చిన్న ప్రేగు)
- అత్యాధునిక ట్రాన్స్‌ప్లాంట్ సౌకర్యాలు
- విపరీతమైన ఖచ్చితత్వం మరియు సునిశితత్వం స్థాయికి దాత మరియు గ్రహీత కార్యకలాపాలకు సరైన సమన్వయం మరియు ప్రణాళికను కలిగి ఉండటం .
- కార్డియాలజిస్ట్‌లు, రెస్పిరేటరీ ఫిజిషియన్‌లు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్‌లు, సాంక్రమిక వ్యాధుల ప్రత్యేక నిపుణులు, ఎండోక్రినాలజిస్ట్‌లు, నెఫ్రాలజిస్ట్‌లు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు మరియు వస్కులర్ సర్జన్లు అందరూ పాల్గొనవలసి ఉంటుంది.
· ప్రయోగశాల, క్రిటికల్ కేర్ యూనిట్లు, ఆపరేటింగ్ థియేటర్ మరియు పునరావాస(రీహ్యాబిలిటేషన్) యూనిట్‌లో ఉన్నత స్థాయి నైపుణ్యం కలిగిన వారు ఉండటం అవసరం. పేరుపొందిన సంస్థలలో, ఎప్పటికప్పుడు కొత్త విజయాలు నమోదవుతుండటంతో పాటు, ప్రతిరోజూ అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయి.