గుండె మార్పిడి-ఇది ప్రయాణం, ప్రక్రియ కాదు
గుండె మార్పిడి అనేది ఇక ఏమాత్రం సైన్స్ ఫిక్షన్ ఫాంటసీలలో భాగం కాదు. ప్రస్తుత వైద్యరంగంలో ఇది సుస్పష్టమైన వాస్తవం. గుండె మార్పిడిలో వ్యాధిగ్రస్తుల గుండె స్థానంలో దాత యొక్క ఆరోగ్యకరమైన గుండెను, ముఖ్యంగా గుండె ఆగిపోయినప్పుడు భర్తీ చేస్తారు. ఎజెక్షన్ ఫ్రాక్షన్ (EF)ని కొలిచే ఎకోకార్డియోగ్రామ్ ద్వారా మరియు గుండె వైఫల్యానికి ప్రతిస్పందనగా రక్తంలో NT-pro BNP హార్మోన్ పెరగడాన్ని గుర్తించడం ద్వారా గుండె వైఫల్యాన్ని నిర్ధారించవచ్చు.
తీవ్రమైన గుండె వైఫల్యం విషయంలో, రోగికి గుండె మార్పిడి అవసరం కావచ్చు. సాలిడ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఎదురుచూస్తున్న గ్రహీతల కోసం నిర్వహించబడే ప్రభుత్వ నిరీక్షణ జాబితాలో రోగి చేర్చబడతారు మరియు వెయిట్‌లిస్ట్ ప్రాధాన్యత ప్రకారం వారికి అవయవం అందించబడుతుంది.
మార్పిడి యొక్క ఫలితం కేవలం శస్త్రచికిత్స ద్వారా మాత్రమే కాకుండా మార్పిడికి ముందు మరియు తర్వాత బృందంచే అనేక ప్రక్రియల ద్వారా నిర్ణయించబడుతుంది.
దాతను మదింపు చేయడం మరియు గ్రహీతను సిద్ధం చేయడం
అవయవాన్ని గ్రహీతకు మార్పిడి చేయడంలో నాణ్యత మరియు భద్రతను అంచనా వేయడానికి, దాతను ఎకోకార్డియోగ్రాఫిక్, హీమోడైనమిక్, హార్మోనల్, బ్రోంకోస్కోపిక్ మరియు ఇన్ఫెక్షియస్ వ్యాధి పారామితుల శ్రేణి ద్వారా మూల్యాంకనం చేస్తారు. మెదడు చనిపోయిన దాతకు నిర్వహించబడే అధునాతన చికిత్సా ప్రోటోకాల్‌ల ద్వారా అవయవం మరియు మార్పిడి ఫలితం యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి దాత రీసక్సైటేషన్ కూడా నిర్వహించబడుతుంది.
గ్రహీతకు కూడా తీవ్రమైన మదింపు ప్రక్రియలను నిర్వహించిహించి, మార్పిడి కోసం సిద్ధం చేస్తారు. ECMO మరియు VAD వంటి మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డివైజ్‌లు కొత్త అవయవం అందుబాటులోకి వచ్చే వరకు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులలో సర్క్యులేషన్ కోసం ఉపయోగించబడతాయి.
గుండె మార్పిడి శస్త్రచికిత్స
దాత దొరికిన తర్వాత, గుండెను తీసివేసి, చల్లబరిచి ప్రత్యేక ద్రావణంలో నిల్వ చేసి, మార్పిడిని వీలైనంత త్వరగా నిర్వహిస్తారు. శస్త్రచికిత్స సమయంలో, రోగిని గుండె-ఊపిరితిత్తుల యంత్రంపై ఉంచుతారు, ఇది ఓవైపు గుండె ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ రక్తం నుండి ముఖ్యమైన ఆక్సిజన్ మరియు పోషకాలు శరీరానికి అందేలా చూస్తుంది. గుండె ఎగువ గదులలోని కర్ణిక వెనుక గోడలు మినహా రోగి యొక్క గుండెను తొలగిస్తారు. దాత గుండె వెనుక ఎడమ ఎగువ గది వద్ద తెరవబడుతుంది, ఇది స్వీకర్త యొక్క సంబంధిత మిగిలిన అవయవానికి అనుసంధానించబడి ఉంటుంది. కుడి వైపున ఉన్న 2 పెద్ద సిరలు (వీనా కావా ) స్వతంత్రంగా అనుసంధానించబడి ఉంటాయి. అప్పుడు రక్త నాళాలను అనుసంధానించగా, గుండె మరియు ఊపిరితిత్తుల ద్వారా రక్తం ప్రవహిస్తుంది. ఇది దాదాపు 4 నుండి 8 గంటల పాటు సాగే క్లిష్టమైన ప్రక్రియ.
గుండె మార్పిడి అనంతర ప్రోటోకాల్‌లు
అత్యాధునిక వసతులు కల ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలలో నిఘా వ్యవస్థ ఉంటుంది, ఇది ఇన్‌ఫెక్షన్‌లు, హార్మోన్ అసమతుల్యత మధుమేహం మరియు బోలు ఎముకల వ్యాధి (ఓస్టియోపోరోసిస్) వంటి సమస్యలను నివారించడానికి నిశితంగా అనుసరిస్తుంది. తీవ్రమైన తిరస్కరణను ఎండోమయోకార్డియల్ బయాప్సీ మరియు దీర్ఘకాలిక తిరస్కరణను వినూత్న ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రామ్ ద్వారా అంచనా వేస్తారు, ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా కొన్ని కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
గుండె మార్పిడి అనేది కేవలం శస్త్రచికిత్స మాత్రమే కాదు, గుండె వైఫల్య నిర్వహణతో ప్రారంభమై, దయతో, అప్రమత్తతతో కూడిన ట్రాన్స్‌ప్లాంట్ అనంతర పర్యవేక్షణ యొక్క ఉత్తమ ఫలితాలను పొందేలా చూడటానికి ట్రాన్స్‌ప్లాంట్ పూర్వ చర్యలను కలిగి ఉండే సుదీర్ఘమైన సంక్లిష్టమైన ప్రక్రియ.