సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images

ప్రేగు ట్రాన్స్‌ప్లాంట్

ప్రేగు ట్రాన్స్‌ప్లాంట్

Intestine Transplant
గత దశాబ్దంలో పేగు ట్రాన్స్‌ప్లాంట్ ఫలితాలు మెరుగుపడ్డాయి. గ్రాఫ్టింగ్ వైఫల్యం లేదా మరణానికి దారితీసిన సాంకేతిక మరియు ఇమ్యునోలాజిక్ సమస్యల వల్ల ట్రాన్స్‌ప్లాంట్‌కు సంబంధించిన ప్రారంభ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. అయితే, ఇటీవలి కాలంలో శస్త్రచికిత్సల విషయంలో సాధించిన పురోగతులు, తీవ్రమైన సెల్యులార్ తిరస్కరణ నియంత్రణ మరియు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల తగ్గుదల ఫలితంగా, 1 సంవత్సరంలో రోగి మనుగడ రేటు ఇప్పుడు 90% మించిపోయింది.గట్ వైఫల్యం ఉన్న రోగుల చికిత్సలో పేగు మార్పిడి పాత్ర నిజానికి గణనీయమైనది.టోటల్ పేరెంటరల్ న్యూట్రిషన్ (TPN=కృత్రిమ పోషణ) అనేది ప్రస్తుతం పేగు శోషక పనితీరు విఫలమైన రోగికి ప్రాథమిక నిర్వహణ చికిత్సగా పరిగణించబడుతుంది.అయితే, భారతదేశంలో, పేగు వైఫల్య సేవల కొరత, దీర్ఘకాలిక TPN విషయంలో ఉండే ఆర్థిక పరిమితులు, పేలవమైన పరిశుభ్రత పద్ధతులు మరియు TPN కాథెటర్‌లను నిర్వహించడానికి స్టెరైల్ విధానాల అవశ్యకత గురించి అవగాహన లేకపోవడం వల్ల, అటువంటి రోగులకు TPN తో బ్రిడ్జింగ్‌ చేయడానికి బదులుగా పేగు ట్రాన్స్‌ప్లాంట్ సరైన ఎంపిక కావచ్చు.

ఈ క్రింది మూడు సమస్యలలో ఒకదానిని కలిగి ఉండి, కోలుకోలేని గట్ వైఫల్యం ఉన్న రోగులకు ట్రాన్స్‌ప్లాంట్‌ నిర్వహించబడుతుంది:

  • ·         TPN సంక్లిష్టతలు
  • ·         పేగు వైఫల్యం ద్వారా ఎదురయ్యే జీవన-నాణ్యత పరిమితులకు అలవాటు పడలేకపోవడం
  • ·         స్థానిక గట్ తొలగించబడకపోతే అధిక మరణ ప్రమాదం ( విచ్ఛేదించలేని మెసెంటెరిక్ కణితులు లేదా దీర్ఘకాలిక ప్రేగు అడ్డంకి వంటివి)

శస్త్రచికిత్సా విధానాలు మార్పిడి చేయబడిన ప్రేగు పరిమాణం ఆధారంగా వర్గీకరించబడతాయి.

  • ·         చిన్న ప్రేగులను మాత్రమే మార్పిడి చేయడానికి ఇంటెస్టైన్ ఎలోన్ ట్రాన్స్‌ప్లాంట్ (IT).
  • ·         సవరించిన మల్టీవిసెరల్ ట్రాన్స్‌ప్లాంట్: కాలేయం మినహా జీర్ణాశయ గ్యాస్ట్రో-ప్రేగు అవయవాలన్నీ మార్పిడి చేయబడతాయి
  • ·         మల్టి విసెరల్ ట్రాన్స్‌ప్లాంట్: ఇందులో కాలేయంతో సహా పొత్తికడుపు గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ అవయవాలు ట్రాన్స్‌ప్లాంట్ చేయబడతాయి.

పేగు మార్పిడి అవసరానికి దారితీసే పరిస్థితులు రక్త సరఫరాలో లోపం వల్ల పేగును కోల్పోవడం నుండి శోధ వరకు ( క్రోన్స్ మరియు అల్సరేటివ్ పెద్దప్రేగు శోథ ) మరియు న్యూరో -ఎండోక్రైన్ ట్యూమర్‌లు మరియు డెస్మోయిడ్ ట్యూమర్‌లు వంటి ఉదర కుహరంలో నెమ్మదిగా పెరుగుతున్న కణితుల కేసుల వరకు ఇవి భిన్నంగా ఉంటాయి .

Telephone Call Icon Call Us Now +91 8069991061 Book Health Check-up Book Appointment

Request A Call Back

Close