సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images

రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ

రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ

వెనుకకు

క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే అది ఆ వ్యక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందుకే ముందుకు కొనసాగే మార్గాన్ని ఎంచుకునే ముందు పరిస్థితి గురించి వాస్తవాలు మరియు చికిత్స కోసం అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

క్యాన్సర్ల శస్త్రచికిత్స చికిత్స సాంప్రదాయకంగా ఓపెన్ టెక్నిక్‌ల ద్వారా జరుగుతుంది. ఓపెన్ సర్జరీతో పెద్ద గాయం కలిగించడంతో పాటు ఆలస్యంగా కోలుకోవడం మరియు సాధారణ కార్యకలాపాలకు తిరిగి రావడంలో జాప్యం కావడం వంటి సమస్యలు ఉంటాయి. లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స పెద్దప్రేగు, ఎండోమెట్రియల్, గర్భాశయ మరియు అన్నవాహిక క్యాన్సర్‌తో సహా కొన్ని క్యాన్సర్‌లకు సాధ్యమయ్యే, చక్కటి సురక్షిత ఎంపికగా పేరుగాంచింది, అయితే 2-డైమెన్షనల్ చిత్రాన్ని మాత్రమే చూడగలగడం, పరిమిత కదలికలతో కూడిన సాధనాలు మరియు కెమెరా పట్టుకోవడానికి శిక్షణ పొందిన సహాయకుడిపై ఆధారపడాల్సి రావడం ద్వారా ఈ విధానానికి కూడా పరిమితులు ఉన్నాయి.

మరోవైపు డా విన్సీ సిస్టమ్‌తో రోబోటిక్ సర్జరీలో, సర్జనే స్వయంగా నియంత్రించగలిగే హై డెఫినిషన్ కెమెరా మాగ్నిఫైడ్ 3-డైమెన్షనల్ వీక్షణను అందిస్తుంది. విపరీతమైన స్వేచ్ఛతో కదిలే సాధనాలు (ఎండో-రిస్ట్), ఇరుకైన పరిమిత ప్రదేశాలలో, క్యాన్సర్‌లను చేరుకోవడం కష్టంగా ఉండే ప్రదేశాల్లో మరియు ఓపెన్ లేదా లాపరోస్కోపిక్ పరికరాలతో అసాధ్యమైన కోణాల్లో పరికరాలను ఉపయోగించడానికి సర్జన్‌ని అనుమతిస్తుంది. సర్జన్ వేళ్ల కదలికల నిష్పత్తిలో పరికరం కదిలేలా దాని కదలిక స్థాయిని తగ్గించడానికి మోషన్ స్కేలింగ్ సర్జన్‌ని అనుమతిస్తుంది, ఇది ఎక్కువ ఖచ్చితత్వాన్ని అనుమతిస్తుంది. ఇవన్నీ క్యాన్సర్ శస్త్రచికిత్సలో అసాధారణమైన శస్త్రచికిత్సా పద్ధతులకు సాటిలేని సౌలభ్యాన్ని, ఖచ్చితత్వాన్ని అందిస్తాయి.

మెరుగైన విజువలైజేషన్‌‌ను అందించడం కారణంగా నరాలు మరియు ఇతర సంక్లిష్ట నిర్మాణాలను సంరక్షించడంతో రోబోటిక్ టెక్నిక్‌లు రాడికల్ ఆపరేషన్‌కు వెసులుబాటు కలిగిస్తాయి. పురీషనాళ, గైనకాలజీ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ శస్త్రచికిత్సలలో ఇది చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు, రోబోటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో, నరాలకు హాని కలిగించకుండా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. నరాలు మరియు నాళాలు అన్ని పెద్దవిగా కనిపించడంతో వాటిని కాపాడుతూ శక్తిని నిలుపుకొనేలా చేయడం చాలా సులభం.

రోగి ప్రయోజనాలు:

  • క్యాన్సర్ కణజాలాన్ని ఖచ్చితంగా తొలగించగలగడం
  • నొప్పి గణనీయంగా తగ్గుతుంది
  • తక్కువ రక్త నష్టం
  • తక్కువ మచ్చలు
  • తక్కువ ఆసుపత్రి బస
  • సాధారణ రోజువారీ కార్యకలాపాలకు వేగంగా తిరిగి రావడం
  • ఓపెన్ సర్జరీకి సమానమైన వేగంతో క్యాన్సర్ నివారణ

కణితులను మినహాయించి ఆచరణాత్మకంగా అన్ని క్యాన్సర్‌లు ఈ విధానానికి అనుకూలంగా ఉంటాయి .రోబోటిక్ శస్త్రచికిత్స అద్భుతమైన ఫలితాలను అందించగల నిర్దిష్ట క్యాన్సర్‌లు:

  • పెద్దప్రేగు మరియు పురీషనాళ క్యాన్సర్
  • ఎండోమెట్రియల్ [గర్భాశయ] మరియు సర్వైకల్ క్యాన్సర్
  • అన్నవాహిక [ఆహార పైపు] మరియు జీర్ణాశయ క్యాన్సర్
  • ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క ప్రారంభ కేసులు
  • కిడ్నీ, మూత్రాశయం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్

ట్రాన్స్‌ ఓరల్ రోబోటిక్ సర్జరీ (TORS) : ఇది మరొక రకమైన మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ, ప్రత్యేకంగా తల మరియు మెడ క్యాన్సర్ ఉన్న రోగుల కోసం రూపొందించబడింది. ఇక్కడ, సర్జన్ నోటి ద్వారా చొప్పించిన రోబోటిక్ పరికరాలను నియంత్రిస్తారు. శరీరంపై కోతలు అవసరం లేదు. దీనికి విరుద్ధంగా, సాంప్రదాయ ఓపెన్ సర్జరీకి గొంతు మరియు దవడ దగ్గర పొడవుగా కోయాల్సిరావడంతో, రోగులపై తరచుగా మచ్చలు కనిపించడానికి, శ్వాస తీసుకోవడంలో లేదా మింగడంలో ఇబ్బంది కలగడానికి మరియు కోలుకోవడానికి సుదీర్ఘకాలం పట్టడానికి కారణమవుతుంది.

ఈ క్రింది వాటికి చికిత్స చేయడానికి ట్రాన్స్ ఓరల్ రోబోటిక్ సర్జరీ ఉపయోగించబడుతుంది.

  • గొంతు క్యాన్సర్
  • నాలుక క్యాన్సర్
  • గవదల క్యాన్సర్

నిస్సందేహంగా, క్యాన్సర్‌ను జయించగలదనే నిజమైన ఆశను కలిగిస్తూ క్యాన్సర్ రోగులలో మనుగడ మరియు జీవన నాణ్యతను మెరుగుపరిచడం ద్వారా రోబోటిక్ సర్జికల్ టెక్నిక్‌లు క్యాన్సర్ శస్త్రచికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి.

Telephone Call Icon Call Us Now +91 8069991061 Book Health Check-up Book Appointment

Request A Call Back

Close