రినైసన్స్ (పునరుజ్జీవనం)™ రోబోటిక్ సర్జికల్ విధానం వెన్నెముక శస్త్రచికిత్సను ఫ్రీహ్యాండ్ విధానం నుండి అత్యంత ఖచ్చితమైన, తక్కువ రేడియేషన్‌తో కూడిన అత్యాధునిక రోబోటిక్ విధానాలకు మార్చడంతో పాటు మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ (MIS), పార్శ్వగూని (స్కోలియోసిస్) మరియు ఇతర సంక్లిష్ట వెన్నెముక వైకల్యాల వంటి ప్రక్రియలకు ఉపయోగించబడుతుంది. ఇది మినిమల్లీ ఇన్వేసివ్ రోబోటిక్ గైడెడ్వెన్నెముక శస్త్రచికిత్సవిధానం.
రినైసన్స్ (పునరుజ్జీవనం)™ రోబోటిక్ టెక్నాలజీ అనేది వెన్నెముక శస్త్రచికిత్స కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఏకైక సాంకేతికత మరియు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఆసియా-పసిఫిక్‌లో మినిమల్లీ ఇన్వేసివ్ రోబోటిక్ గైడెడ్వెన్నెముక శస్త్రచికిత్సవిధానమైన ఈ సర్జికల్ గైడెన్స్ సిస్టమ్‌ను అందించడంలో మొదటిది.
రోబోటిక్స్ ఎందుకు?
ఇటీవలి సంవత్సరాలలో అపోలో హాస్పిటల్స్ రోబోటిక్స్ మరియు మినిమల్లీ-ఇన్వేసివ్ సర్జరీలపై బలంగా దృష్టి సారిస్తోంది. ఎందుకంటే మా రోగులకు అత్యుత్తమ వైద్య సాంకేతికతలను అందించాలని మేము భావిస్తున్నాము. స్పైనల్ రోబోటిక్స్ రోగి ఫలితాలపై చూపే సానుకూల ప్రభావాన్ని మేము గుర్తించిన తర్వాత, ఈ సాంకేతిక అద్భుతాన్ని భారతదేశానికి తీసుకురావడం సులభమైంది. స్పైనల్ రోబోటిక్స్ ప్రెసిషన్, యదార్ధత (ఎక్యూరసీ) మరియు మినిమల్లీ-ఇన్వేసివ్ స్పైనల్ సర్జరీని అందిస్తూ రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
అపోలో హాస్పిటల్ఇప్పటికే వెన్నెముక శస్త్రచికిత్సల కోసం ప్రపంచవ్యాప్త ప్రజలకు ఒక ముఖ్యమైన రిఫరల్ కేంద్రంగా తయారవ్వడంతో పాటు వెన్నెముక శస్త్రచికిత్సలో, రోగుల ఆరోగ్య సంరక్షణ కొరకు సరికొత్త సాంకేతికతలను అవలంబించడంలో ఎంతో ఖ్యాతిని గడించి, మినిమల్లీ-ఇన్వాసివ్ సర్జరీలలో అగ్రగామిగా ఉంది.
ప్రారంభించినప్పటి నుండి, 175 కంటే ఎక్కువ విజయవంతమైన శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయి మరియు అనేక మంది రోగులు ఇప్పటికే ఈ ప్రక్రియ నుండి ఎంతో ప్రయోజనం పొందారు. అపోలో హాస్పిటల్స్ వైద్యులైన డా సజన్ కె హెగ్డే , సీనియర్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాల్య వైకల్యాలపై సంక్లిష్ట పునర్నిర్మాణాల నుండి క్రింది వెన్ను భాగం నొప్పికి మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీల వరకు అనేక రకాల ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించారు.