సోషల్ మీడియాలో అపోలో హాస్పిటల్‌తో మాట్లాడండి:

Breadcrumb Images

యాజమాన్యం

ఉత్కృష్టత అనే మాటకు అసమానమైన ఆధిక్యత అని అర్ధం, అపోలో హాస్పిటల్స్ గొప్పతనం ఇదే. ఇది – మౌలిక వసతులు, సాంకేతికత లేదా సేవలు లేదా మా వైద్య విధానాలు మరియు ప్రమాణాల సామర్ధ్యం మరియు తేజో వికాసం వంటి అనేక ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తుంది. మేము సాధించిన విజయాలలో కొన్నింటిని క్రింద అందించాము:

 

 

ఉమెన్ ఇన్ ఎక్సలెన్స్ హెల్త్‌కేర్ అవార్డు సంవత్సరం
డా. సంగీత రెడ్డి

జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్‌ గారికి ప్రతిష్టాత్మక ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) ద్వారా ఉమెన్ ఇన్ ఎక్సలెన్స్ హెల్త్‌కేర్ అవార్డు లభించింది.

2022
చాంపియన్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డ్ సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్‌ అయిన ఈయనకు హిందుస్థాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛాంపియన్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును అందించింది.

2021

 

గౌరవ GERAS సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్, జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియాచే గౌరవ గెరాస్ అనే బిరుదుతో సత్కరించారు .

2021
ది ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సంవత్సరం
శ్రీమతి ప్రీతారెడ్డి _

వైస్ చైర్‌పర్సన్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్, కోవిడ్-19 వ్యాప్తి సమయంలో అత్యుత్తమ వైద్య సంరక్షణను అందించిన అపోలో హాస్పిటల్స్‌కు గుర్తింపుగా ఈవిడ ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

2020

 

ది ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సంవత్సరం
శ్రీమతి సునీతారెడ్డి _

అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, కోవిడ్-19 వ్యాప్తి సమయంలో అత్యుత్తమ వైద్య సేవలను అందించిన అపోలో హాస్పిటల్స్‌కు గుర్తింపుగా ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

2020
హెల్త్‌కేర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సంవత్సరం
శ్రీమతి ప్రీతారెడ్డి _

వైస్ చైర్‌పర్సన్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్‌, ఈవిడకు FICCI హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2020లో భాగంగా ‘హెల్త్‌కేర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ లభించింది.

2020

 

రోటరీ ఇన్‌స్టిట్యూట్ – సూపర్ అచీవర్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డ్ సంవత్సరం
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్, ఈయనకు అందరికీ అందుబాటులో ఉండే అధిక నాణ్యత కల హెల్త్‌కేర్‌ను అందించడంతోపాటు ప్రివెంటివ్ హెల్త్‌కేర్ కోసం ఒక మోడల్‌ను రూపొందించడం ద్వారా అందుబాటులోని హెల్త్‌కేర్‌లో నవకల్పనలకు ఆద్యునిగా పాత్ర వహించినందుకు రోటరీ ఇన్‌స్టిట్యూట్ 2019 సూపర్ అచీవర్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ అవార్డ్‌ను అందించారు.

2019
ఉత్తమ ఇన్‌స్టిట్యూట్ బిల్డర్ అవార్డు సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్, ఈయన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ద్వారా అత్యుత్తమ సంస్థ బిల్డర్ అవార్డును అందుకొన్నారు.

2019

 

ఎఫెక్టివ్ సక్సెషన్ ప్లానింగ్ అవార్డు సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

ఎకనమిక్ టైమ్స్ ఫ్యామిలీ బిజినెస్ అవార్డ్స్‌లో భాగంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్‌ అయిన ఈయనకు ‘ఎఫెక్టివ్ సక్సెషన్ ప్లానింగ్’ అవార్డు లభించింది.

2019
హెల్త్‌కేర్ ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్స్ అవార్డు సంవత్సరం
డా. సంగీత రెడ్డి

అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వీరిని, హెల్త్‌కేర్‌లో ఇన్నోవేషన్‌పై భారతదేశం యొక్క అతిపెద్ద ఈవెంట్ – ‘నేటి డిజిటల్ ఇండియాలో హెల్త్‌కేర్’లో భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆదర్శప్రాయమైన పాత్రను పోషించినందుకు ప్రతిష్టాత్మక హెల్త్‌కేర్ ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్స్ అవార్డుతో సత్కరించారు.

2019

 

అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్త సంవత్సరం
డా. సంగీత రెడ్డి

అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్‌కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన వీరికి, IWEC ఫౌండేషన్ నుండి ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ 2019 అవార్డు లభించింది.

2019
ఉత్తమ మహిళా హెల్త్‌కేర్ అధినేత్రి – మెడికో అవార్డ్ సంవత్సరం
డా. సంగీత రెడ్డి

వీరికి ప్రతిష్టాత్మక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డ్స్ నుండి “బెస్ట్ ఫిమేల్ హెల్త్‌కేర్ లీడర్” మెడికో అవార్డును అందించారు.

2019

 

లయన్స్ హ్యూమానిటేరియన్ అవార్డు సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరు భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల కొద్దీ ప్రజలకు ఆరోగ్య సంరక్షణ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలను అందుబాటులోకి తెచ్చి అందుబాటు ధరలో అందించడానికి చేసిన కృషికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ప్రతిష్టాత్మకమైన లయన్స్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్న ఐదవ భారతీయుడు మరియు రెండవ వైద్యుడుగా ఘనత సాధించారు.

2018
ABLF బిజినెస్ కరేజ్ అవార్డు సంవత్సరం
శ్రీమతి ప్రీతారెడ్డి _

వైస్ చైర్‌పర్సన్‌ అయిన వీరిని ఏషియన్ బిజినెస్ లీడర్‌షిప్ ఫోరమ్ (ABLF), దుబాయ్ నుండి ABLF బిజినెస్ కరేజ్ అవార్డు వరించింది . ఈ అవార్డును అందుకున్న వీరు నిజమైన నాయకత్వంలోని సారాంశాన్ని నిర్వచించే ఒక బలమైన వ్యాపార నాయకులు: కార్పొరేట్, సమాజం మరియు మానవ మూలధనం యొక్క భద్రతకు భరోసా ఇస్తూనే సమృద్ధి మరియు సంక్షోభ సమయాల్లో సునాయాసంగా మార్గదర్శకత్వం చేసే వ్యక్తి.

2018

 

ఐకానిక్ మ్యాన్ అవార్డ్ సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

ఆర్గనైజేషన్ (FLO) ద్వారా ది ‘ఐకానిక్ మ్యాన్’ అవార్డును అందుకున్నారు .

2017
గ్లోబల్ హెల్త్‌కేర్ ఐకాన్ సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరు, టెలిమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా గ్లోబల్ హెల్త్‌కేర్ ఐకాన్‌ ఘనతను పొందారు.

2017

 

గౌరవ డాక్టరేట్ డిగ్రీ సంవత్సరం
శ్రీమతి శోభన కామినేని

వైస్ చైర్‌పర్సన్ అయిన వీరు హెల్త్‌కేర్ & ఫార్మాస్యూటికల్స్‌లో చేసిన జీవిత కృషికి మరియు భారతదేశంలో వ్యాపార విస్తరణలో ఆమె నాయకత్వ పాత్రకు గుర్తింపుగా USAలోని ప్రతిష్టాత్మక బ్రయంట్ విశ్వవిద్యాలయం సైన్స్ గౌరవ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేసింది.

2017
గౌరవ డాక్టరేట్ సంవత్సరం
డా. సంగీత రెడ్డి

అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన వీరికి, ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మకమైన మాక్వేరీ విశ్వవిద్యాలయం భారతీయ ఆరోగ్య సంరక్షణ, భారతదేశంలో ఆరోగ్య IT అభివృద్ధి మరియు భారతదేశం మరియు విదేశాలలో అనేక రకాల కార్యక్రమాలలో గణనీయ మార్పులను తీసుకురావడానికి ఆమె చేసిన అలుపెరుగని నిబద్ధతకు గుర్తింపుగా ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

2017

 

గౌరవ డాక్టరేట్ సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ అయిన వీరిని, మిలియన్ల మంది ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు ఆదర్శప్రాయమైన సహకారం అందించినందుకు UNSW, ఆస్ట్రేలియా గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

2016
FICCI హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డు సంవత్సరం
డా. సంగీత రెడ్డి

అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన వీరు FICCI హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2015లో భాగంగా అందించిన హెల్త్‌కేర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

2015

 

పీపుల్ CEO అవార్డులు – మహిళా నాయకత్వం సంవత్సరం
శ్రీమతి ప్రీతారెడ్డి _

వైస్ చైర్‌పర్సన్‌ అయిన వీరికి నేషనల్ హెచ్‌ఆర్‌డి నెట్‌వర్క్ ద్వారా ఎన్‌హెచ్‌ఆర్‌డిఎన్ ‘పీపుల్ సిఇఓ అవార్డ్స్ – ఉమెన్ లీడర్‌షిప్’ లభించింది.

2014
ఎంటర్‌ప్రైజ్ ఆసియా యొక్క “ఏరియా” ప్రోగ్రామ్, దక్షిణాసియా – “బాధ్యతగల వ్యాపార నాయకుడు(రెస్పాన్సిబుల్ బిజినెస్ లీడర్)” అవార్డు సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

ఎంటర్‌ప్రైజ్ ఆసియా యొక్క “ఏషియా రెస్పాన్సిబుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డ్స్” ప్రోగ్రామ్ (AREA), సౌత్ ఆసియా 2012 అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన డా.ప్రతాప్ సి రెడ్డి గారిని ప్రతిష్టాత్మక “రెస్పాన్సిబుల్ బిజినెస్ లీడర్” అవార్డుతో సత్కరించారు.

2012

 

ఫార్చూన్ ఇండియా “వ్యాపారంలో టాప్ 50 అత్యంత శక్తివంతమైన మహిళలు” ర్యాంకింగ్ సర్వే సంవత్సరం
శ్రీమతి ప్రీతారెడ్డి _

మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఫార్చూన్ మ్యాగజైన్ యొక్క భారతదేశంలోని వ్యాపారంలో టాప్ 50 అత్యంత శక్తివంతమైన మహిళలలో 7వ స్థానంలో నిలిచారు..

2012
డాక్టరేట్ ఆఫ్ సైన్స్ (హానోరిస్ కాసా) సంవత్సరం
శ్రీమతి ప్రీతారెడ్డి _

భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈమె అందించిన విశిష్ట సహకారానికి తమిళనాడు డాక్టర్ MGR వైద్య విశ్వవిద్యాలయంచే డాక్టరేట్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేయబడింది.

2009

 

ఛైర్మన్ – CII నేషనల్ హెల్త్‌కేర్ కమిటీ సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

CII నేషనల్ హెల్త్‌కేర్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు

2007
FICCI మహిళా సంస్థ సంవత్సరం
డా. సంగీత రెడ్డి

జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ IWEC ఫౌండేషన్ నుండి ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ 2019 అవార్డును అందుకున్నారు.

2007

 

మోడరన్ మెడికేర్ ఎక్సలెన్స్ అవార్డు సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ అయిన వీరు, హెల్త్‌కేర్ పరిశ్రమలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు ICICI గ్రూప్ ద్వారా అవార్డు పొందారు.

2006
ఆసియా-పసిఫిక్ బయో-బిజినెస్ లీడర్‌షిప్ అవార్డు సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరు, మార్షల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా ఆసియా-పసిఫిక్ బయో లీడర్‌షిప్ అవార్డును అందుకున్నారు.

2005

 

టాప్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు సంవత్సరం
డా. సంగీత రెడ్డి

వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో టాప్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు లభించింది .

2005
ఫ్రాంచైజ్ అవార్డు సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరు, బిజినెస్ డెవలప్‌మెంట్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చినందుకు ఫ్రాంచైజ్ అవార్డును అందుకున్నారు.

2004

 

ఎర్నెస్ట్ & యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన ఈయన, ఎర్నెస్ట్ & యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

2001
ఫెలోషిప్ యాడ్ హోమినెమ్ సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరికి, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ ద్వారా ఫెలోషిప్ యాడ్ హోమినెమ్‌ను ప్రదానం చేశారు.

2000

 

సర్ నీలరత్తన్ సిర్కా మెమోరియల్ ఓరేషన్ (జిమా) అవార్డు సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

సమాజంలోని అధిక శాతం వర్గానికి సూపర్ స్పెషాలిటీ కేర్‌ను సునాయాసంగా అందుబాటులోకి తెచ్చినందుకు ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు.

1998
యంగ్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సంవత్సరం
డా. సంగీత రెడ్డి

అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన వీరు హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నుండి యంగ్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.

1998

 

భారతదేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరిని, బిజినెస్ ఇండియా సంస్థ వారు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశంలో మార్పులు తీసుకువచ్చిన 50 ప్రధాన వ్యక్తులలో ఒకరిగా గుర్తించింది

1997
‘సిటిజన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ అయిన్న వీరిని మదర్ సెయింట్ థెరిసా ‘సిటిజన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించారు.

1993

 

భారత ప్రభుత్వం నుండి ఆహ్వానం సంవత్సరం
డా. ప్రతాప్ సి రెడ్డి

హెల్త్ ఫైనాన్సింగ్ మరియు మేనేజ్‌మెంట్‌పై వర్కింగ్ గ్రూప్‌లో సభ్యునిగా ఉండటానికి భారత ప్రభుత్వం నుండి ఆహ్వానం అందుకున్నారు

1992
ఇండో-USCEO సభ్యత్వం సంవత్సరం
శ్రీమతి ప్రీతారెడ్డి _

భారతదేశ ప్రధాన మంత్రి ద్వారా ఇండో-USCEO యొక్క ఫోరమ్‌లో సభ్యునిగా నియమించబడ్డారు

 

 

‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు సంవత్సరం
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరికి, కార్పొరేట్ ఎక్సలెన్స్ కోసం ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్‌లో భాగంగా ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు.

2021
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరికి మన దేశంలో వైద్య మరియు హాస్పిటల్ పరిశ్రమకు అందించిన అపార సేవలకై నానయం వికటన్ బిజినెస్ స్టార్, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు.

2021
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరికి, కార్పొరేట్ గవర్నెన్స్‌లో తన దక్షతను వాస్తవ రూపంలోనికి మార్చినందుకు ICSI లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.

2021
డా. ప్రతాప్ సి. రెడ్డి

EY ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డులలో భాగంగా భారతదేశంలో ప్రైవేట్ హెల్త్‌కేర్‌ను స్థాపించడంలో వీరి మార్గదర్శక పాత్రకు గుర్తింపుగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్‌ అయిన వీరికి ఎర్నెస్ట్ & యంగ్ ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు.

2020
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరు, IMTJ మెడికల్ ట్రావెల్ అవార్డ్స్ ద్వారా సంజీవ్ మాలిక్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.

2019
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరికి, నైతిక విలువలతో కూడిన నాయకత్వం & పాలనకై ఏషియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ & సస్టైనబిలిటీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది.

2019
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరిని, AISCCON (ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫరెన్స్) లో గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

2018
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరిని, టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్‌కేర్ అచీవర్స్ కాన్క్లేవ్ సంస్థ, ఆరోగ్య సంరక్షణకు ఆదర్శవంతమైన నిబద్ధతను, ప్రభావవంతమైన సహకారాన్ని అందించినందుకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది.

2018
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరికి, సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ వారు హెల్త్‌కేర్‌లో డాక్టర్. బిఎల్ మహేశ్వరి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసారు.

2017
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ టెలిమెడిసిన్ & ఇ-హెల్త్ నుండి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు

2017
డా. ప్రతాప్ సి. రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరు, ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) నుండి లైఫ్‌టైమ్ కంట్రిబ్యూషన్ అవార్డును అందుకున్నారు.

2014
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ అయిన వీరు, ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ 2013లో CNBC TV18 ద్వారా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఆధునిక హెల్త్‌కేర్ రూపశిల్పిగా మరియు భారతదేశంలో కార్పొరేట్ హెల్త్‌కేర్ యొక్క మార్గదర్శకుడిగా ఈయన పేరు గడించారు, ఈ పురస్కారం మన దేశంలోని హెల్త్‌కేర్‌ రంగంలో మార్పులు తీసుకురావడానికి ఛైర్మన్ చేసిన జీవితకాల ప్రయత్నాలను సత్కారంగా అందించంబడింది.

2013
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరిని, ప్రతిష్టాత్మక ఏషియన్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్ వారు లైఫ్‌టైమ్ (ABLF) అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే చైర్మన్ దార్శనికతను మరియు సామాజిక స్పృహ, దాతృత్వంతో పాటు శ్రేష్ఠత, ఆవిష్కరణ మరియు సుస్థిరత యొక్క విలువలను పెంపొందించి భాగస్వామ్యం చేయడం కోసం ఆయన జీవితకాలం గడిపారని ఈ అవార్డు గుర్తించింది.

2013
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన డా ప్రతాప్ సి రెడ్డి ప్రతిష్టాత్మక ఎన్‌డిటివి ఇండియన్ ఆఫ్ ది ఇయర్, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.

2013
డా. ప్రతాప్ సి రెడ్డి

మేనేజింగ్ ఇండియా అవార్డ్స్‌లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్‌ను AIMA సత్కరించింది.

2012
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్‌ అయిన విరికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అవార్డును ప్రదానం చేసింది.

2011
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన ఈయన, FICCI అందించే ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.

2011
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ అయిన ఈయనకు, హెల్త్‌కేర్ రంగంలో ప్రతిష్టాత్మక అలెగ్జాండ్రియా – ఫ్రాస్ట్ & సుల్లివాన్అవార్డ్ లభించింది, అపోలో ఫార్మసీకి హెల్త్‌కేర్ రిటైల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించారు.

2010
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్, డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి హాస్పిమెడికా ఇంటర్నేషనల్ ద్వారా ప్రతిష్టాత్మకమైన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.

2002
డా. ప్రతాప్ సి రెడ్డి

అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ అయిన వీరిని, రోటరీ ఇంటర్నేషనల్ వారు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు

 
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు సంవత్సరం
శ్రీమతి ప్రీతారెడ్డి _

లయోలా ఫోరమ్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ ద్వారా అందించబడిన సాంఘిక శాస్త్ర రంగంలో విశిష్ట సేవలందించినందుకు వైస్ ఛైర్‌పర్సన్‌ అయిన వీరిని లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు .

2012
Telephone Call Icon Call Us Now +91 8069991061 Book Health Check-up Book Appointment

Request A Call Back

Close