కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఉదర సంబంధిత గర్భాశయ చికిత్స అంటే ఏమిటి?
ప్రక్రియ చేసే విధానం ఏమిటి?
కోక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం, ఇది అంతర్గత మరియు బాహ్య భాగాలను కలిగి ఉంటుంది. పరికరం ధ్వని యొక్క స్పర్శను అందించడానికి కోక్లియర్ నాడిని (వినికిడి సంబంధిత) ప్రేరేపిస్తుంది. ప్రత్యేకమైన ఇంప్లాంట్ శస్త్రచికిత్స మీకు సరిగా వినడానికి సహాయపడుతుంది. అయితే, ఇది మీ వినికిడి లోపాన్ని పునరుద్ధరించడం లేదా సరిచేయడం వంటివి చేయబడవు. |
ఎందువలన ఇది చేయబడుతుంది?
మీరు కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేసుకోవాలని చెప్పబడినట్లయితే:
- మీరు ప్రస్తుతం రెండు చెవుల్లో వినికిడి లోపం కలిగి ఉంటారు.
- వినికిడి కోసం వాడే పరికరం అంతగా సహకారి కాదు
- మీరు వినగలుగుచున్నారు కాని చాలా తక్కువ స్పష్టతతో వినగలుగుచున్నారు
- మీకు శస్త్రచికిత్స చేసుకోవలసిన అవసరాన్ని కలిగించే ఇతర వైద్య సమస్యలు ఏమియూ లేవు
ప్రక్రియ జరిగే సమయంలో ఏమి జరుగుతుంది? |
సాధారణ అనస్థీషియా ఉపయోగించి కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేయబడుతుంది. మస్టాయిడ్ ఎముకను తెరవడానికి సర్జన్ చెవి వెనుక చిన్న గాటు పెడతారు. ఫేసియల్ నాడి గుర్తించబడుతుంది మరియు కోక్లియాను ఉపయోగించడానికి వాటి మధ్య మార్గం ఏర్పరచబడుతుంది. కోక్లియా తెరిచిన తర్వాత, ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్ దానిలో చేర్చబడుతుంది. రిసీవర్ (ఒక సాధారణ అనస్థీషియా ఉపయోగించి కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేయబడుతుంది. మస్టాయిడ్ ఎముకను తెరవడానికి సర్జన్ చెవి వెనుక చిన్న గాటు పెడతారు. ఫేసియల్ నాడి గుర్తించబడుతుంది మరియు కోక్లియాను ఉపయోగించడానికి వాటి మధ్య మార్గం ఏర్పరచబడుతుంది. కోక్లియా తెరిచిన తర్వాత, ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్ దానిలో చేర్చబడుతుంది. రిసీవర్ (ఒక ఎలక్ట్రానిక్ పరికరం) చెవి వెనుక చర్మం కింద ఉంచబడుతుంది మరియు గాటు భాగం మూసివేయబడుతుంది.
చికిత్స కోసం ఎంత సమయం పడుతుంది? |
మీ పరిస్థితిని బట్టి కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స 2-4 గంటలు సమయం తీసుకొంటుంది. మీ సర్జన్ మీకు శస్త్రచికిత్స గురించి వివరంగా తెలియజేస్తారు. |
ప్రక్రియ చేయబడిన తర్వాత ఏమవుతుంది?
మీకు నొప్పి తగ్గడానికి మందులు ఇవ్వబడతాయి మరియు మీరు కోలుకోవడానికి పట్టే సమయాన్ని బట్టి మీయొక్క డిశ్చార్జ్ సమయం నిర్ణయించబడుతుంది. మీయొక్క తదుపరి సందర్శన కూడా షెడ్యూల్ చేయబడుతుంది. 4-6 వారాల తరువాత, పరికరం యొక్క బాహ్య భాగం అనుసంధానించబడుతుంది. బాహ్య పరికరాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో మరియు దానిని ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకుంటారు. మీరు స్పీచ్-లాంగ్వేజ్ థెరపిస్ట్ మరియు ఆడియాలజిస్ట్ని కలవాలని సిఫార్సు చేయబడవచ్చు. |
ప్రక్రియను నిర్వహించుటలో అపోలో యొక్క ప్రావీణ్యత
అపోలో హాస్పిటల్లోని నిపుణులు వినికిడి లోపంతో బాధపడే అనేక మంది పిల్లలు మరియు పెద్దలకు సహాయం చేశారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ 1500కి పైగా కోక్లియర్ ఇంప్లాంట్లను విజయవంతంగా నిర్వహించగలిగింది, ఇది అపోలో హాస్పిటల్లోని నిపుణులు వినికిడి లోపంతో బాధపడే అనేక మంది పిల్లలు మరియు పెద్దలకు సహాయం చేశారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ 1500కి పైగా కోక్లియర్ ఇంప్లాంట్లను విజయవంతంగా నిర్వహించగలిగింది, ఇది దక్షిణాసియాలోనే అతిపెద్ద కార్యక్రమం. అతి చిన్న వయస్కులకు N7 పరికరాన్ని ఉపయోగించి బైలేటరల్ కోక్లియర్ ఇంప్లాంట్లు డిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ చేత నిర్వహించబడినవి.
సంప్రదిస్తూ ఉండండి
మా వైద్యుడిని సంప్రదించడానికి, ఇక్కడ క్లిక్ చేయండి |
తరచుగా అడిగే ప్రశ్నలు
ఇది పిల్లలకు అనుకూలంగా ఉంటుందా?
అవును, పిల్లలు కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స ద్వారా ప్రయోజనం పొందవచ్చు. వారు మాట్లాడటo మరియు భాషా నైపుణ్యాలను నేర్చుకునే ముఖ్యమైన వయసులో శబ్దాల వినికిడిలో ఇది సహాయపడుతుంది. మీరు మా నిపుణుని సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.
కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అందరికీ అనుకూలంగా ఉంటుందా?
కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స ప్రతి ఒక్కరికీ సరైన ఎంపిక కాకపోవచ్చు. మీరు కోక్లియర్ ఇంప్లాంట్ స్పెషలిలిస్టుతో కలవాలి, వారు కొన్ని టెస్ట్లు చేస్తారు మరియు ఇతర నిపుణులు (ఆడియోలజిస్టులు, స్పీచ్-లేంగ్వేజ్ థెరపిస్టులు మొదలైనవారు) యొక్క అభిప్రాయాలను తెలుసుకొనుటకు మిమ్మల్ని రిఫర్ చేస్తారు. వీరందరి నుండి పొందిన నివేదికల ఆధారంగా, కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స మీకు అనుకూలమైనదా కాదా అనేది నిర్ణయించబడుతుంది.
ఈ శస్త్రచికిత్స ద్వారా నేను ఎలా ప్రయోజనం పొందగలను?
- పెదవి కదలిక ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవలసిన అవసరం లేకుండా మంచి వినికిడిని అందిస్తుంది
- ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చక్కగా వినగలుగుతారు
- వివిధ స్థాయిల ధ్వనుల తేడా అర్థం చేసుకోవటం
- బాగా వినగలగటం వల్ల బాగా మాట్లాడే సామర్థ్యం పెరుగుతుంది