Verified By Apollo General Physician June 6, 2024
6902టెటానస్ వ్యాక్సిన్ అనేది పిల్లల మరియు పెద్దల టీకా శ్రేణిలో ఒక భాగం, ఇది “లాక్‌జా” అని కూడా పిలువబడే బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ టెటానస్ నుండి రక్షణను అందిస్తుంది. ధనుర్వాతం అనేది నాడీ వ్యవస్థపై దాడి చేసే విషపూరిత బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది, దీని వలన సాధారణంగా మెడ మరియు దవడ కండరాలు చుట్టూ బాధాకరమైన కండర సంకోచాలు ఏర్పడతాయి.
తెగిన లేదా ఇతర గాయం ద్వారా టెటానస్ రావొచ్చు. టెటానస్ బ్యాక్టీరియా మట్టి, దుమ్ము మరియు పేడలో సాధారణంగా ఉంటుంది. మీరు కలుషితమైన గోర్లు లేదా కత్తుల ద్వారా ఏర్పడిన లోతైన గాయాల ద్వారా కూడా టెటానస్‌ను సంక్రమించవచ్చు.
అదృష్టవశాత్తూ, టెటానస్ వ్యాక్సిన్ కారణంగా, ప్రపంచవ్యాప్తంగా టెటానస్ ఇన్‌ఫెక్షన్ కేసులు తగ్గాయి, అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది ఇంకా సర్వసాధారణంగానే కొనసాగుతుంది.
టెటానస్ (ధనుర్వాతం) లక్షణాలు ఏమిటి?
మీకు టెటానస్ బ్యాక్టీరియా సోకిన తర్వాత కొన్ని రోజుల నుండి చాలా వారాల వరకు ఎప్పుడైనా మీలో టెటానస్ లక్షణాలు కనిపిస్తాయి. దీని లక్షణాలు బయటపడటానికి సగటున సుమారుగా 7 నుండి 10 రోజుల వరకు పడుతుంది.
టెటానస్ బాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్ కారణంగా లక్షణాలు సంభవిస్తాయి. అత్యంత సాధారణ లక్షణం దవడ గట్టిపడటం, ఇది తరచుగా కదలకుండా బిగుసుకుపోవచ్చు, దీని కారణంగా దీనిని లాక్‌జా అని పిలుస్తారు.
సాధారణంగా గమనించిన కొన్ని లక్షణాలు –
· చిరాకు మరియు విసుగు
· చేతులు, కాళ్లు, మెడ, ఉదరం మరియు దవడలోని కండరాలు బిగిసుకుపోవడం
· జ్వరం మరియు చెమటలు పోయడం
· పెరిగిన రక్తపోటు మరియు దడ
· మింగడంలో ఇబ్బంది
· తలనొప్పి
· కండరాల నొప్పులు వింతగా కనిపించే నవ్వు లేదా చిరునవ్వును కలిగిస్తాయి
సరైన సమయంలో చికిత్స చేయకపోతే, టెటానస్ ఇన్ఫెక్షన్ ఊపిరాడకుండా చేసి మరణానికి దారి తీస్తుంది.
టెటానస్ యొక్క సంక్లిష్టతలు:
సంక్లిష్టతలు
టెటానస్ టాక్సిన్ మీ నరాల చివరలను బంధించిన వెంటనే, దానిని తొలగించడం అసాధ్యం. కొత్త నరాల ముగింపులు వృద్ధి చెందేవరకు టెటానస్ ఇన్ఫెక్షన్ నుండి పూర్తిగా కోలుకోవడం వీలుపడదు, దీనికి చాలా నెలల వరకు పట్టవచ్చు.
టెటానస్ ఇన్ఫెక్షన్ ఈ క్రింది సంక్లిష్టతలను కలిగి ఉండవచ్చు:
· విరిగిన ఎముకలు: దుస్సంకోచాల తీవ్రత ఎముకలు మరియు వెన్నెముక విరిగిపోవడానికి దారితీయవచ్చు
· పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తుల ధమని ప్రతిష్టంభన)
· మరణం: తీవ్రమైన టెటానస్-ప్రేరిత (టెటానిక్) కండరాల నొప్పులు మీ శ్వాసకు అంతరాయం కలిగించవచ్చు లేదా ఆపివేయవచ్చు. ఆక్సిజన్ లేకపోవడం కూడా గుండె ఆగిపోవడం మరియు మరణానికి కారణమవుతుంది.
టెటానస్ (ధనుర్వాతం) రావడానికి కారణం ఏమిటి?
ధూళి, జంతువుల మలం మరియు మట్టిలో కనిపించే క్లోస్ట్రిడియం టెటాని బ్యాక్టీరియా స్పోర్స్ ద్వారా ఉత్పత్తి చేయబడిన టాక్సిన్ ఫలితంగా టెటానస్ వస్తుంది. ఈ స్పోర్‌లు మాంసపు గాయంలోకి లోతుగా ప్రవేశించినప్పుడు, అవి టెటానోస్పాస్మిన్ అనే ప్రాణాంతక టాక్సిన్‌ను విడుదల చేసే బ్యాక్టీరియాగా రూపాంతరం చెందుతాయి.
కండరాలు, అనగా, కండరాల పనితీరును నియంత్రించే మోటార్ న్యూరాన్లు ఈ టాక్సిన్ ద్వారా బలహీనపడతాయి. దీని ఫలితంగా కండరాలు నొప్పులు మరియు కండరాలు బిగుసుకుపోవడం ఏర్పడతాయి, ఇది టెటానస్ యొక్క ప్రధాన లక్షణం.
ముందుగా టీకాలు వేయించుకోని వ్యక్తులలో లేదా 10-సంవత్సరాల బూస్టర్ షాట్ తీసుకోని పెద్దలలో ధనుర్వాతం కేసులు సాధారణంగా గమనించబడతాయి. ధనుర్వాతం అంటు వ్యాధి కాదు కాబట్టి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందదు.
టెటానస్(ధనుర్వాతం) కి చికిత్స ఏమిటి?
ధనుర్వాతానికి చికిత్స లేదు. అందుబాటులో ఉన్న చికిత్స ఎంపికలలో గాయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, లక్షణాలను తగ్గించడానికి మందులు మరియు సరైన సహాయక చికిత్సలు ఉన్నాయి.
గాయం రక్షణ
టెటానస్ బీజాంశాల(స్పోర్స్) పెరుగుదలను నిరోధించడానికి ఏర్పడిన గాయం మొదటి దశలో ఉండగానే దాని నుండి ఏవైనా బాహ్య పదార్ధాలు, ధూళి లేదా మృత కణజాలాలను తొలగించడం వంటివి చేయాలి.
ఔషధం
టెటానస్ చికిత్స కోసం క్రింది మందులను సూచించవచ్చు .
· టీకా : మీకు టెటానస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన వెంటనే, మీరు వెంటనే టెటానస్ వ్యాక్సిన్‌ని తీసుకోవాలి.
· యాంటిటాక్సిన్ : మీ వైద్యుడు నాడీ కణజాలాలకు ఇంకా బంధనం కాని ఏదైనా టాక్సిన్‌ను తటస్థీకరించడానికి టెటానస్ ఇమ్యూన్ గ్లోబులిన్‌ను అందించవచ్చు.
· యాంటీబయాటిక్స్ : ఇంజెక్షన్ ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్ తీసుకోవాలని మీ డాక్టర్ సిఫారసు చేయవచ్చు.
· మత్తుమందులు : కండరాల నొప్పులను నియంత్రించడానికి , శక్తివంతమైన మత్తుమందులు ఇవ్వబడతాయి
· ఇతర మందులు : ధనుర్వాతం చికిత్సకు ఉపయోగించే ఇతర ఔషధాలలో మెగ్నీషియం సల్ఫేట్ మరియు బీటా-బ్లాకర్స్ శ్వాస మరియు హృదయ స్పందన వంటి ఏదైనా అసంకల్పిత కండరాల కదలికలను నియంత్రించడానికి ఉన్నాయి.
సపోర్టివ్ కేర్
తీవ్రమైన టెటానస్ ఉన్న వ్యక్తులు ఇంటెన్సివ్ కేర్ వాతావరణంలో ఉండవలసి ఉంటుంది. మత్తుమందులు శ్వాసను నిరోధిస్తాయి కాబట్టి మీరు తాత్కాలికంగా వెంటిలేషన్‌లో(కృత్రిమ శ్వాసను అందించే వెంటిలేటర్లపై) ఉండవలసి ఉంటుంది.
టెటానస్‌తో సంబంధం ఉన్న సంభావ్య ప్రమాద కారకాలు ఏమిటి?
ధనుర్వాతం అంటు వ్యాధి కానప్పటికీ, ఈ క్రింది అంశాలు ధనుర్వాతం వచ్చే సంభావ్యతను పెంచుతాయి –
· టెటానస్ స్పోర్లు మీ మాంసం ద్వారా చొచ్చుకుపోయేలా చేసే ఏదైనా లోతైన గాయం లేదా గాయం.
· చీలిక లేదా గోరు వంటి శరీరేతర పదార్ధం నుండి గాయం
· టీకా సరిగా తీసుకోకపోవడం లేదా ఎప్పటికప్పుడు టెటానస్ బూస్టర్ షాట్‌లు తీసుకోకపోవడం.
ధనుర్వాతం కింది కారకాల ద్వారా అభివృద్ధి చెందుతుంది:
· తుపాకీ గాయాలు, లేదా శరీరంపై పడిన కుట్లు, ఇంజెక్షన్ మందులు, పచ్చబొట్లు లేదా చీలికల నుండి ఏర్పడిన గాయాలు.
· కాలిన గాయాలు
· పగుళ్లు ఒకే దగ్గర ఏర్పడి, అవి పెద్ద పగుళ్ళుగా పరిణమించడం
· పాదాలపై ఏర్పడిన పుండ్లకు ఇన్ఫెక్షన్ సోకడం
· శస్త్రచికిత్స గాయాలు
· డెంటల్ ఇన్ఫెక్షన్
· కీటకాలు లేదా జంతువు కాటు
· టీకాలు తీసుకోని తల్లుల నుండి నవజాత శిశువుల యొక్క అప్పుడే కత్తిరించిన బొడ్డు మొనల ద్వారా శిశువులకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల.
టెటానస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా నివారించాలి?
టెటానస్ ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి ఏకైక మార్గం సమయానికి టీకాలు వేయించుకోవడం. టెటానస్ వ్యాక్సిన్ షాట్ సాధారణంగా డెల్టాయిడ్ కండరాలలో ఇవ్వబడుతుంది. పిల్లలకైతే తొడ లేదా చేతికి షాట్లు ఇస్తారు.
· కోరింత దగ్గు టీకాకు ప్రతికూల ప్రతిచర్యను ఎదుర్కొన్న శిశువులు మరియు పసిబిడ్డలకు DT ఇవ్వబడుతుంది. ఇది టెటానస్ మరియు డిఫ్తీరియాకు వ్యతిరేకంగా మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది.
· DTaP అనేది శిశువులు మరియు పసిబిడ్డలు టెటానస్, పెర్టుసిస్ (కోరింత దగ్గు అని కూడా పిలుస్తారు) మరియు ధనుర్వాతం నుండి రక్షించడానికి ఉద్దేశించబడింది. DTaP టీకా అనేది ఐదు షాట్ల శ్రేణి, సాధారణంగా వయస్సులో పిల్లలకు తొడ లేదా చేతికి ఇవ్వబడుతుంది:
o 2 నెలల
o 4 నెలలు
o 6 నెలల
o 15 నుండి 18 నెలలు
o 4 నుండి 6 సంవత్సరాలు
కౌమారదశలో ఉన్నవారు 11 మరియు 12 సంవత్సరాల మధ్య DTaP మోతాదును పొందాలని మరియు ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒక DT బూస్టర్‌ను పొందాలని సూచించబడింది.
మీ టీకాలన్నింటిని ఎప్పటికప్పుడు అందుకునేలా జాగ్రత్త తీసుకోవడానికి, మీ టీకా స్థితిని క్రమం తప్పకుండా సమీక్షించడానికి మీ డాక్టర్‌తో మాట్లాడండి.
మీరు చిన్నతనంలో టెటానస్‌కు టీకాలు వేయకుంటే, Tdap టీకా గురించి మీ వైద్యుడిని సంప్రదించండి. మీరు గత 10 సంవత్సరాలలో ఎటువంటి బూస్టర్ షాట్ తీసుకోనట్లయితే లేదా మీకు లోతైన గాయం ఉండి, గత ఐదేళ్లలో ఎటువంటి బూస్టర్ షాట్ తీసుకోనట్లయితే, షాట్ తీసుకోవాల్సిందిగా సూచించడమైనది.
అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి 1860-500-1066కు కాల్ చేయండి.
ముగింపు
ప్రత్యేకంగా మీరు పంక్చర్ గాయం లేదా లోతుగా తెగిన గాయం వంటి తీవ్రమైన గాయం కోసం చికిత్స పొందుతున్నట్లయితే, టెటానస్ వ్యాక్సిన్ యొక్క అదనపు బూస్ట్‌ను అందుకోవడం సరైందే. సరైన సమయంలో టీకాలు తీసుకోవడం ధనుర్వాతం నిరోధించడానికి ఉత్తమ మార్గం.
టీకాలు వేయించుకోని పెద్దలు మొదటి మూడు టెటానస్ షాట్‌లను పొందాలి. మొదటి రెండు షాట్లు నాలుగు వారాల వ్యవధిలో ఇవ్వబడతాయి, అయితే మూడవది రెండవ షాట్ తర్వాత ఆరు నుండి పన్నెండు నెలలకు ఇవ్వబడుతుంది. ప్రారంభ శ్రేణి సఃఆట్లు తీసుకోవడం పూర్తయిన తర్వాత, ప్రతి పదేళ్లకు బూస్టర్‌లు సూచించబడతాయి. టెటానస్ వ్యాక్సిన్ గురించి మరింత తెలుసుకోవడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు):
1. టెటానస్ షాట్ ఎంతకాలం ప్రభావవంతంగా ఉంటుంది?
మీరు ప్రారంభ టెటానస్ సిరీస్‌ను పూర్తి చేసిన తర్వాత, మీరు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బూస్టర్ షాట్‌లను తీసుకోవాలి. కానీ, మీకు పంక్చర్ గాయం ఉన్నట్లయితే, మీరు ఆఖరుసారి తీసుకున్న టెటానస్ షాట్‌తో సంబంధం లేకుండా మీరు బూస్టర్ షాట్‌ను పొందాలి.
2. మీరు వైద్యుడిని సందర్శించినప్పుడు మీరు ఏమి ఆశించాలి?
మీరు లోతైన గాయం కోసం వైద్యుడిని సంప్రదించినట్లయితే, అతను/ఆమె ముందుగా గాయాన్ని పరిశీలిస్తారు. కండరాల నొప్పులు వంటి ఏవైనా టెటానస్ లక్షణాలను మీరు గమనించినట్లయితే మీ వైద్యుడు ఆరా తీస్తాడు. అతను/ఆమె మీ లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయా లేదా నిరంతరం ఉంటున్నాయా లేదా మీరు చివరిసారిగా టెటానస్‌కి వ్యతిరేకంగా టీకాలు ఎప్పుడు తీసుకున్నారు మరియు మీరు స్వీకరించిన టీకా ఏ రకానికి చెందినది అనే విషయాలను పరిశీలిస్తారు. ఇది మీ టెటానస్ షాట్‌కు సంబంధించిన భవిష్యత్తులో ఎటువంటి చర్యను చేపట్టాలో నిర్ణయించడంలో అతనికి/ఆమెకు సహాయం చేస్తుంది.
3. తుప్పు పట్టిన లోహంతో కోసుకున్నప్పుడు లేదా తెగినప్పుడు తర్వాత నేను టెటానస్ షాట్ తీసుకోకపోతే ఏమి జరుగుతుంది?తుప్పు పట్టిన లోహం నుండి కత్తిరించిన తర్వాత మీరు టెటానస్ షాట్‌ను పొందడంలో విఫలమైతే, శ్వాసకోశ కండరాలపై టాక్సిన్ ప్రభావం శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది. ఇది చివరికి ఊపిరాడక చివరకు మరణానికి దారి తీస్తుంది. పంక్చర్‌లు, కాలిన గాయాలు, తెగిన గాయాలు, జంతువుల కాటు లేదా చితకబాదిన గాయాలు వంటి చిన్న లేదా పెద్ద ఏదైనా చర్మ గాయం తర్వాత మీకు టెటానస్ ఇన్‌ఫెక్షన్ రావచ్చు.
Our expert general medicine specialists verify the clinical accuracy of the content to deliver the most trusted source of information makine management of health an empowering experience
June 7, 2024