Verified By Apollo Gastroenterologist June 7, 2024
1606ఉదర సంబంధిత శస్త్రచికిత్స తర్వాత మీకు కడుపు నిండినట్లు అనిపిస్తుందా? డంపింగ్ సిండ్రోమ్ వల్లే మీకు ఆ అనుభూతి కలుగుతూ ఉండవచ్చు. డంపింగ్ సిండ్రోమ్ అనేది బరువు తగ్గడానికి మీ ఉదరం మొత్తం లేదా కొంత భాగాన్ని తొలగించడానికి చేసే శస్త్రచికిత్స తర్వాత లేదా మీ ఉదరాన్ని బైపాస్ చేయడానికి శస్త్రచికిత్స చేసిన తర్వాత లేదా అన్నవాహిక శస్త్రచికిత్స తర్వాత చోటు చేసుకునే కొన్ని దుష్ప్రభావాలు.
సిండ్రోమ్ అనేది మన అన్నవాహిక లేదా జీర్ణాశయం మనం తినే ఆహారాన్ని చాలా త్వరగా ప్రేగులోకి తరలించే (డంపింగ్) చేసే స్థితిని సూచిస్తుంది.
డంపింగ్ సిండ్రోమ్ అవలోకనం
డంపింగ్ సిండ్రోమ్‌ను ‘రాపిడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్’ అని కూడా అంటారు. ఈ పరిస్థితి యొక్క లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రమైన వరకు మారవచ్చు. మీరు భోజనం చేసిన కొద్దిసేపటికే లేదా చాలా సమయం తర్వాత లక్షణాలను అనుభవించవచ్చు.
ఈ పరిస్థితి ప్రాణాంతకమైనది కాదు మరియు శస్త్రచికిత్స తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ మరియు సరైన ఆహారం తీసుకోవడంతో ఈ లక్షణాలు సాధారణంగా సమసిపోతాయి. అయితే, కొన్ని సమస్యలు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరతకు దారితీయవచ్చు.
డంపింగ్ సిండ్రోమ్ యొక్క వివిధ దశలు ఏమిటి?
డంపింగ్ సిండ్రోమ్ స్వల్ప మరియు దీర్ఘకాలిక లక్షణాలను చూపుతుంది. సంకేతాలు మరియు లక్షణాల ఆగమనంపై ఆధారపడి, పరిస్థితిని రెండు దశలుగా వర్గీకరించవచ్చు: అవి ప్రారంభ మరియు చివరి దశలు.
ప్రారంభ దశలో ఈ లక్షణాలు సాధారణంగా భోజనం చేసిన రెండు నుండి మూడు గంటలలోపు కనిపిస్తాయి. మరోవైపు, చివరి దశలో ఉండగా ఈ లక్షణాలు భోజనం చేసిన మూడు గంటల తర్వాత కనిపిస్తాయి.
డంపింగ్ సిండ్రోమ్ యొక్క ప్రధాన లక్షణాలు?
డంపింగ్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు సాధారణంగా శస్త్రచికిత్స తర్వాత భోజనం చేసిన తర్వాత కనిపిస్తాయి. ప్రారంభ మరియు చివరి లక్షణాలలో ఏవైనా కనిపించవచ్చు. పరిస్థితి యొక్క ప్రారంభ దశ యొక్క కొన్ని సాధారణ సంకేతాలు:
· కడుపు ఉబ్బిన భావన
· వాంతులు
· పొట్టి కడుపు కండరాలు పట్టేయడం
· వికారం
· హృదయ స్పందన రేటు పెరగడం
· నిట్టూర్పులు
· తలతిరగడం
· అతిసారం
డంపింగ్ సిండ్రోమ్ యొక్క కొన్ని సాధారణ లక్షణాలు :
· బలహీనత
· చెమటలు పట్టడం
· నిట్టూర్పులు
· హృదయ స్పందన రేటు వేగవంతం కావడం
· తలతిరగడం
కొంతమంది వ్యక్తులు ప్రారంభ మరియు చివరి లక్షణాలను కలిగి ఉంటారు. మరియు, శస్త్రచికిత్స చేసిన సంవత్సరాల తర్వాత డంపింగ్ సిండ్రోమ్ అభివృద్ధి చెందుతుంది.
డంపింగ్ సిండ్రోమ్ కోసం వైద్యుడిని ఎప్పుడు కలవాలి?
మీరు శస్త్రచికిత్స చేయించుకున్నా లేదా చేయించుకొకపోయినా, పైన పేర్కొన్న ఏవైనా సంకేతాలు మరియు లక్షణాలు మీకు ఎక్కువ కాలం ఉంటే మీ వైద్యుడిని సందర్శించండి. అలాగే, ఆహార మార్పులు లక్షణాలను తగ్గించడంలో సహాయపడకపోతే లేదా మీరు పెద్ద మొత్తంలో బరువు కోల్పోతుంటే మీరు వైద్యుడిని సందర్శించాలి.
మీరు ఉత్తమ వైద్య సేవలు మరియు చికిత్స కోసం సమీపంలోని అపోలో హాస్పిటల్స్ యొక్క ఏదైనా శాఖలను సందర్శించవచ్చు.
అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి 1860-500-1066కు కాల్ చేయండి
డంపింగ్ సిండ్రోమ్ యొక్క కారణాలు ఏమిటి?
ఏదైనా కడుపు సంబంధిత శస్త్రచికిత్స ఆహార మార్గములో ఆహార కదలికను ప్రభావితం చేస్తుంది. ఇది డంపింగ్ సిండ్రోమ్‌కు కారణమయ్యే చిన్న ప్రేగులకు ఆహారాన్ని వేగంగా మరియు అసాధారణంగా డంప్ చేయడానికి దారితీస్తుంది. చక్కెర మరియు కార్బోహైడ్రేట్లలో అధికంగా ఉండే భోజనం పరిస్థితి యొక్క లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
ఈ పరిస్థితికి మరొక కారణం శస్త్రచికిత్స అనంతర ప్రేగులలో ఏర్పడే సాగుదల. పేగుల త్వరిత వ్యాకోచ సంకోచాలు డంపింగ్ సిండ్రోమ్‌కు దారి తీస్తాయి.
డంపింగ్ సిండ్రోమ్‌తో సంబంధం ఉన్న ప్రమాద కారకాలు ఏమిటి?
డంపింగ్ సిండ్రోమ్ యొక్క ఏకైక ప్రధాన ప్రమాద కారకం గ్యాస్ట్రిక్ శస్త్రచికిత్సలు. గ్యాస్ట్రిక్ సర్జరీలు కడుపు ఆకారం మరియు పనితీరును మారుస్తాయి. ఇది జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినడానికి దారి తీస్తుంది, దీని వలన ప్రేగులలోకి ఆహారం వేగంగా డంప్ అవుతుంది. ఈ పరిస్థితికి ప్రాథమిక ప్రమాద కారకాలైన కొన్ని సాధారణ గ్యాస్ట్రిక్ శస్త్రచికిత్సలు:
గ్యాస్ట్రెక్టమీ. ఇది జీర్ణాశయంలోని ఒక చిన్న భాగాన్ని లేదా మొత్తాన్ని తొలగించే శస్త్రచికిత్సా ప్రక్రియ.
గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ. గ్యాస్ట్రిక్ బైపాస్ శస్త్రచికిత్స అనేది అనారోగ్య లేదా తీవ్రమైన ఊబకాయం చికిత్సకు సమర్థవంతమైన మార్గం. ప్రక్రియ సమయంలో, వైద్యులు జీర్ణాశయం యొక్క చిన్న భాగాన్ని వేరు చేస్తారు. ఈ చిన్న భాగం నేరుగా చిన్న ప్రేగులకు జోడించబడుతుంది. ఇది ఆకలిని కోల్పోయేలా చేయడంతో పాటు ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది.
ఈసోఫాగెక్టమీ. ఎసోఫాగెక్టమీ అనేది అన్నవాహిక యొక్క కొంత భాగాన్ని లేదా మొత్తం అన్నవాహికను (మీ నోటిని జీర్ణాశయంతో కలిపే ఆహార గొట్టం) తొలగించే ప్రక్రియ.
డంపింగ్ సిండ్రోమ్‌కు చికిత్స ఏమిటి?
డంపింగ్ సిండ్రోమ్ యొక్క ప్రారంభ మరియు ఆలస్యమైన కొన్ని లక్షణాలు కాలక్రమేణా (సాధారణంగా రెండు నుండి మూడు నెలల వరకు) వాతంతటవే పరిష్కరించబడతాయి. లక్షణాలను మరియు ఏదైనా అసౌకర్యాన్ని తగ్గించడానికి మీరు కొన్ని ఆహార మార్పులను ప్రయత్నించవచ్చు. అయితే, ఆహార మార్పుల ద్వారా ప్రయోజనం కనిపించకపోతే లేదా మీ లక్షణాలు వాతంతటవే తగ్గకపోతే, మీరు మీ వైద్యుడిని సంప్రదించవలసి ఉంటుంది. మీ పరిస్థితిని బట్టి, మీ డాక్టర్ పరిస్థితికి చికిత్స చేయడానికి మందులు లేదా శస్త్రచికిత్సను సిఫారసు చేయవచ్చు.
మందులతో చికిత్స
తక్షణ శస్త్రచికిత్స అవసరమైతే తప్ప ఔషధం ఎల్లప్పుడూ చికిత్స యొక్క మొదటి ఎంపికగా ఉంటుంది. మీ వైద్యుడు ఆక్టాపెప్టైడ్ ఔషధాన్ని సూచించవచ్చు, ఇది పరిస్థితికి చికిత్స చేయడానికి సహజ సొమాటోస్టాటిన్ (ఒక పెరుగుదల హార్మోన్) వలె పనిచేస్తుంది. ఇది ఇంజెక్షన్‌తో శరీరంలోకి ప్రవేశపెట్టే డయేరియా మందు.
ఈ రకమైన ఔషధాల యొక్క కొన్ని సాధారణ దుష్ప్రభావాలలో తలనొప్పి, వికారం మరియు వాంతులు ఉన్నాయి. మీరు మీ మందుల చరిత్ర గురించి మీ వైద్యుడికి తెలియజేసినట్లయితే దుష్ప్రభావాల అవకాశాలను తగ్గించవచ్చు.
శస్త్రచికిత్స ద్వారా చికిత్స
డంపింగ్ సిండ్రోమ్ చికిత్సలో మందులు లేదా ఇతర సాంప్రదాయిక విధానాలు ప్రభావవంతంగా లేకుంటే, మీ డాక్టర్ శస్త్రచికిత్సను సూచిస్తారు. పరిస్థితికి చికిత్స చేయడంలో అనేక శస్త్రచికిత్సలు సహాయపడతాయి. ఈ శస్త్రచికిత్సలు సాధారణంగా రీకన్స్ట్రక్టివ్ విధానంలో ఉంటాయి. ఉదాహరణకు, మీకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ తర్వాత ఈ పరిస్థితిని వృద్ధి చెందితే, మీ వైద్యుడు దానిని రివర్స్ చేస్తాడు లేదా కడుపు ఫైలోరిస్‌ను రీకనస్ట్రక్ట్ చేయవచ్చు.
డంపింగ్ సిండ్రోమ్ యొక్క సమస్యలు ఏమిటి?
డంపింగ్ సిండ్రోమ్ ప్రాణాంతకం కాదు. అయితే, చికిత్స చేయకపోతే, పరిస్థితి కొన్ని చిన్న సమస్యలకు దారి తీస్తుంది, ఇవి చికిత్స చేస్తే తగ్గిపోతాయి. కొన్ని సాధారణ సమస్యలు:
అధిక లేదా తక్కువ రక్తపోటు. హృదయ స్పందన రేటు పెరగడం అనేది డంపింగ్ సిండ్రోమ్ యొక్క ప్రారంభ మరియు చివరి దశల రెండింటికి సాధారణ సంకేతం . అందువల్ల, ఈ పరిస్థితికి ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది వేగవంతమైన హృదయ స్పందన హెచ్చుతగ్గులు మరియు రక్తపోటు వైవిధ్యాలకు దారితీస్తుంది.
దీర్ఘకాలిక ఆహార సమస్యలు. డంపింగ్ సిండ్రోమ్ ఆహార మార్గము పనితీరును దెబ్బతీస్తుంది, ఇది పోషకాహార లోపానికి దారితీస్తుంది. అసమర్థమైన జీర్ణవ్యవస్థ కాల్షియం మరియు విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలను సరిగా గ్రహించదు. ఇది బోలు ఎముకల వ్యాధి (బలహీనమైన ఎముకలు) వంటి ఇతర పరిస్థితులకు దారి తీస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండే వైద్య పరిస్థితి ఆయన రక్తహీనతకు కూడా కారణమవుతుంది.
వేగంగా బరువు కోల్పోవడం. ఆహారం జీర్ణవ్యవస్థ ద్వారా చాలా త్వరగా ప్రేగుల్లోనికి నెత్తివేయబడుతుంది కాబట్టి మీ శరీరానికి అవసరమైన క్యాలరీలు అందవు. ఇది చాలా తక్కువ వ్యవధిలో బరువు తగ్గడానికి దారితీస్తుంది.
డంపింగ్ సిండ్రోమ్‌ను ఎలా నివారించాలి?
కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు చేసుకోవడం గ్యాస్ట్రిక్ శస్త్రచికిత్సల యొక్క ఈ సంక్లిష్టతను అభివృద్ధి చేసే అవకాశాలను తగ్గించగలవు. ఈ జీవనశైలి మార్పులు డంపింగ్ సిండ్రోమ్ యొక్క లక్షణాలను నివారించడానికి మరియు తగ్గించడానికి రెండింటికీ ఉపయోగపడతాయి.
తక్కువ మొత్తం భోజనం తీసుకోండి. రోజుకు మూడు పెద్ద భోజనాలు చేయడం మానండి. బదులుగా, మీరు రోజులో చిన్న చిన్న భోజనాలను క్రమమైన అంతరాలలో తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
భోజనంతో పాటు ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవాలి మరియు లేకపోతే తక్కువగా తీసుకోవాలి. మీకున్న ఈ పరిస్థితితో ఇప్పటికే మీ జీర్ణవ్యవస్థలో ఆహార కదలిక చాలా త్వరగా జరుగుతుంది; కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవడం ద్వారా దానిని మరింత వేగవంతం చేయవద్దు. మీరు మీ రోజువారీ ద్రవాలను ఎక్కువ సమయం మీ భోజనంతో పాటు తీసుకోవడాన్ని ప్రయత్నించవచ్చు. మీ జీర్ణవ్యవస్థ సాహిస్తున్న దానిని బట్టి మీరు తీసుకునే మొత్తాన్ని క్రమంగా పెంచండి.
సరైన ఆహారం తీసుకోండి. డంపింగ్ సిండ్రోమ్‌ను నివారించడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాండీలు, కుకీలు, కేకులు, పాల ఉత్పత్తులు మరియు చక్కెర మరియు కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉండే ఇతర ఆహారాలు వంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండండి.
మీరు గ్వార్ గమ్ లేదా మిథైల్ సెల్యులోజ్ వంటి ఫైబర్ సప్లిమెంట్స్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం పెంచుకోవచ్చు. చక్కెరకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించండి అలాగే సాధారణ కార్బోహైడ్రేట్లకు బదులు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తినండి.
సారాంశం
డంపింగ్ సిండ్రోమ్ ద్వారా పెద్ద లేదా ప్రాణాంతకమైన సమస్యలు లేవు. అయితే, ఇది మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. సంక్లిష్ట పరిస్థితులు మరియు డంపింగ్ సిండ్రోమ్ వంటి సమస్యలకు అపోలో హాస్పిటల్స్ శ్రేష్టమైన నైపుణ్యతతో కూడిన చికిత్సను అందిస్తోంది. మా అద్భుతమైన వైద్య సేవలను పొందేందుకు మీరు సమీపంలోని అపోలో హాస్పిటల్‌లలో దేనినైనా సందర్శించవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు)
1. డంపింగ్ సిండ్రోమ్ అనేది జీర్ణాశయ శస్త్రచికిత్స చేయడం ద్వారా ఉత్పన్నమయ్యే చాలా సాధారణ పరిస్థితి?
డంపింగ్ సిండ్రోమ్ అనేది కొన్ని గ్యాస్ట్రిక్ సర్జరీలతో సర్వసాధారణం, మరికొన్నింటిలో ఇది చాలా అరుదు. ఉదాహరణకు, ఇది సాధారణంగా గ్యాస్ట్రిక్ బైపాస్ బారియాట్రిక్ సర్జరీ తర్వాత కనిపిస్తుంది కానీ ఇతర రకాల బేరియాట్రిక్ సర్జరీ తర్వాత అంత సాధారణంగా కనిపించదు. సగటున, ప్రతి 10 మందిలో 1రిలో ఈ సిండ్రోమ్ వృద్ధి చెందుతుంది.
1. డంపింగ్ సిండ్రోమ్ ఎలా నిర్ధారణ అవుతుంది?
డంపింగ్ సిండ్రోమ్‌ను వైద్య చరిత్ర మూల్యాంకనం (ముఖ్యంగా మీరు కడుపు శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే) మరియు గ్యాస్ట్రిక్-ఎంప్టీయింగ్ పరీక్ష ద్వారా నిర్ధారణ చేయవచ్చు. గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ పరీక్షలో, మీ కడుపు ద్వారా ఆహారం ఎంత త్వరగా కదులుతుందో కొలవడానికి ఒక రేడియోధార్మిక పదార్థం ఆహారానికి జోడించబడుతుంది.
· డంపింగ్ సిండ్రోమ్ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుందా ?ఆహారం జీర్ణవ్యవస్థ ద్వారా త్వరగా కదులుతున్నందున, క్లోమం గ్లూకోజ్ విచ్ఛిన్నానికి తగిన ఇన్సులిన్ విడుదలను నిర్వహించదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.
The content is reviewed by our experienced and skilled Gastroenterologist who take their time out to clinically verify the accuracy of the information.