Verified By Apollo Pulmonologist June 6, 2024
220142019 ఆఖర్లో కొరోనావైరస్ COVID-19 మహమ్మారి జూలు విదిల్చినప్పటి నుండి, ఇటీవలి కాలంలో మనమెన్నడూ చూడని అత్యంత ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌లలో ఒకటిగా పరిణమించింది. కోవిడ్-19 యొక్క సాధారణ లక్షణాలలో జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నాయి. కోవిడ్-19 యొక్క అరుదైన లక్షణం కండ్ల కలక అని అధ్యయనాలు కనుగొన్నాయి. కోవిడ్-19 కండ్లకలక తేలికపాటి ఇన్ఫెక్షన్ ఉన్నవారి కంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్-19 బారిన పడిన వారిలో దాదాపు 1% నుండి 3% మంది కండ్లకలక లక్షణాలను కలిగి ఉంటారు.
కండ్లకలకను, పింక్ ఐ అని కూడా పిలుస్తారు, ఇది కంటిలోని పొర (కంజక్టివా)కు ఇన్ఫెక్షన్ సోకి, దాని ఫలితంగా కలిగిన వాపు. కంజక్టివా అనేది మీ కనురెప్పను మరియు మీ కళ్ళలోని తెల్లని భాగాన్ని కప్పి ఉంచే పారదర్శక పొర. కళ్ళ కలకలు ఇన్ఫెక్షన్ కారణంగా పారదర్శక పొర ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారడానికి కారణమవుతాయి, అందుకే దీనికి పింక్ ఐ అని పేరు వచ్చింది.
కండ్ల కలక మన దృష్టిని ప్రభావితం చేయదు, కానీ కొన్నిసార్లు రేపుదలను కలిగిస్తాయి. ఇది ఒక అంటు వ్యాధి కాబట్టి కండ్లకలకకు అది ప్రారంభ దశలో ఉన్నప్పుడే చికిత్స అవసరం. ఇది సాధారణంగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ ఫలితంగా కలుగుతుంది, ఈ సందర్భంలో అయితే, కరోనావైరస్ కారణంగా కలుగుతుంది.
కరోనావైరస్ చుక్కల ద్వారా వ్యాపిస్తుంది మరియు ఇది వ్యాపించడానికి వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మడం లేదా దగ్గడం ప్రాథమిక మూలం. సంక్రమిత వ్యక్తి చుక్కలను బయటకు విడుదల చేసినప్పుడు, అవి ఉపరితలంపై పడతాయి. సాధారణ ఉపరితలాలను తాకడం ద్వారా కరోనావైరస్ వ్యాప్తికి ద్వితీయ మూలం ఇక్కడి నుండే మొదలవుతుంది.
COVID-19 కండ్లకలక రెండు మార్గాల ద్వారా వ్యాపిస్తుంది. SARS-CoV-2 వైరస్ నేరుగా మీ కళ్లలోకి ప్రవేశించవచ్చు లేదా మీరు ఏదైనా ఉపరితలాన్ని పట్టుకుని, ఆపై మీ కళ్లను తాకడం ద్వారా ప్రవేశించవచ్చు. కాబట్టి, కళ్లతో సహా మీ ముఖంలోని ఏదైనా భాగాన్ని తాకడానికి ముందు మీ చేతులను కడుక్కోవడం చాలా ముఖ్యం.
మీకు కండ్ల కలక మరియు కోవిడ్-19 ఉన్నట్లయితే, మీరు కళ్లను రుద్ధి, ఎవరినైనా లేదా ఏదైనా ఉపరితలాన్ని తాకడం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది.
కోవిడ్-19 కండ్లకలక లక్షణాలు సాధారణ కండ్ల కలకవి మాదిరిగానే ఉండి, కోవిడ్-19 లక్షణాలు అదనంగా ఉంటాయి. కండ్ల కలక యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:
● ఒక కంటిలో లేదా రెండింటిలో ఎరుపు లేదా గులాబీ రంగు ఏర్పడటం
● ఒక కంటిలో లేదా రెండింటిలో దురద లేదా రేపుదల
● కంట్లో ఏదో నలక పడినట్లుగా అనిపించడం (ఏదో ఉన్నట్లుగా)
● ఉబ్బిన కళ్ళు
● పొద్దునే లేవగానే లేదా నిద్ర పోయిన తర్వాత కళ్ళు తెరవలేకపోవడం
● కండ్లలో నుండిన్ నీరుకారుట
కోవిడ్-19 కండ్ల కలక వస్తే డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?
మీకు కోవిడ్-19 కండ్లకలక యొక్క ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సందర్శించడం మంచిది. అయితే, డాక్టర్ వద్దకు వెళ్లే ముందు, మీరు వారికి కాల్ చేసి తగిన కోవిడ్-19 భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలి.
క్లినిక్ లేదా ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరాన్ని నివారించడం కోసం మీ డాక్టర్ వీడియో కాల్‌లో కండ్ల కలకకు కొంత చికిత్సను సూచించగలరు. లక్షణాలు తగ్గుతాయో లేదో తెలుసుకోవడానికి మీరు కొన్ని రోజులు వేచి ఉండవచ్చు.
మీకు ఇంకా తగ్గినట్లు అనిపించకపోతే, అపాయింట్‌మెంట్ తీసుకోవడం మరియు వివరణాత్మక రోగ నిర్ధారణ మరియు చెకప్ కోసం మీ వైద్యుడిని సందర్శించడం మంచిది.
అపాయింట్‌మెంట్ బుక్ చేయడానికి 1860-500-1066 కు కాల్ చేయండి
కోవిడ్-19 కండ్లకలక నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
కోవిడ్-19 కండ్లకలక సోకకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మీకు సహాయపడుతుంది. చాలా వరకు ఈ ముందస్తు జాగ్రత్తలు, సులభంగా చేసుకోగలిగే స్వల్ప మార్పులు. మీరు కరోనావైరస్ బారిన పడి కండ్ల కలకను అనుభవిస్తున్నట్లయితే దిగువ జాబితా చేయబడిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా మీ నుండి వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.
కరోనావైరస్ వ్యాప్తి సమయంలో మీరు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నాయి :
● మీ ముఖాన్ని తాకే ముందు చేతులు కడుక్కోండి మరియు అనవసరంగా ముఖాన్ని తాకకుండా ఉండండి.
● మీ చేతులు మరియు సాధారణంగా మీరు చేతులతో తాకే అవకాశమున్న ఉపరితలాలను తరచుగా శానిటైజ్ చేయండి.
● ఎల్లప్పుడూ మాస్క్ లేదా ఫేస్ షీల్డ్ ధరించండి.
కళ్ళద్దాలు ధరించండి
కళ్లద్దాలు అదనపు రక్షణ పొరగా పనిచేస్తాయి. ఇది వైరస్ చుక్కలు మీ కళ్లలోకి ప్రవేశించి, కండ్ల కలక కళ్లకు సోకకుండా నివారిస్తుంది. కళ్లద్దాలు మీ చేతులను మీ కళ్ళకు దూరంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.
కళ్ళను నులియడం ఆపండి
మీకు వ్యాధి సోకినా, లేకపోయినా, మీ చేతులతో మీ కళ్లను తాకకుండా ఉండండి. మీరు మీ కళ్ళను తాకవలసి వస్తే, ఎల్లప్పుడూ ముందు మరియు తరువాత మీ చేతులను కడుక్కోవాలి. మీరు మీ కళ్ళ నుండి ఏదైనా నలుసులు లేదా చికాకును కలిగించే వాటిని శుభ్రపరచడానికి టిష్యూ కాగితాలను కూడా ఉపయోగించవచ్చు.
కాంటాక్ట్ లెన్స్‌లు ఉపయోగించడాన్ని నివారించండి
కాంటాక్ట్ లెన్స్‌లు కళ్ళకు చికాకు కలిగిస్తాయి, ప్రత్యేకించి అవి ఎక్కువ కాలం ధరించినట్లయితే. ఇది మీ కళ్లను రుద్దాలనే కోరికను సృష్టించవచ్చు. కాబట్టి, మీరు కాంటాక్ట్ లెన్సులు ఉపయోగించే వారైతే, కొంత కాలం పాటు కళ్లద్దాలు వాడండి.
కనురెప్పలను ఒక వస్త్రంతో శుభ్రం చేయండి
వైరస్ లేదా బ్యాక్టీరియా అనేది మీ కంజక్టివా ఉపరితలంపై నివసిస్తుంటే, మీ కనురెప్పలను శుభ్రం చేయడం ద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియాను తీసివేయడంలో సహాయపడుతుంది. ఇది చికాకును కూడా తగ్గిస్తుంది మరియు మీ కళ్ళు వదులుగా తయారయ్యేలా చేస్తుంది.
సారాంశం
కండ్లకలక అనేది కరోనావైరస్ యొక్క సాధారణ లక్షణం కాదు, అయినప్పటికీ మీరు దాని గురించి తెలుసుకోవాలి. సాధారణ సంకేతాలు మరియు జాగ్రత్తలను తెలుసుకోవడం వలన మీరు కోవిడ్-19 కండ్లకలక బారిన పడకుండా అరికట్టవచ్చు.
కండ్లకలక అనేది కోవిడ్-19 యొక్క లక్షణం కావచ్చు కాబట్టి, వీలైనంత త్వరగా మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఏ పరిస్థితి అయినా, అది మరింత జఠిలంగా మారడానికి ముందు త్వరగా నిర్ధారించడంలో వైద్యునికి సహాయపడుతుంది.
తరచూ అడిగే ప్రశ్నలు(FAQలు):
1. నాకు కండ్లకలక వస్తే, నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లా?
లేదు, కండ్లకలక కేవలం కరోనావైరస్ యొక్క అరుదైన లక్షణం మాత్రమే. కండ్లకలక కలిగి ఉన్నంత మాత్రాన మీరు కోవిడ్-19తో బాధపడుతున్నారని అర్థం కాదు.
2. కండ్లకలక ద్వారా ఏవైనా ఇతర పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉందా?
కండ్లకలక ద్వారా ఎటువంటి విశిష్ట సమస్యలు లేవు, దీర్ఘకాలం పాటు చికిత్స చేయకపోతే, అవి కార్నియాలో ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు, దీని వలన దృష్టి మసకబారుతుంది. ఈ పరిస్థితిని సులభంగా చికిత్స చేయవచ్చు; అయితే, కోవిడ్-19 కండ్లకలక విషయంలో, కరోనావైరస్ ఉండటం అనేది ఇతర లక్షణాలు మరియు సమస్యలకు దారి తీస్తుంది.
ఆప్తాల్మాజిస్ట్ కొరకు అపాయింట్‌మెంట్ బుక్ చేయండి
అపాయింట్‌మెంట్ బుక్ చేయడానికి 1860-500-1066 కు కాల్ చేయండి
The content is verified and reviewd by experienced practicing Pulmonologist to ensure that the information provided is current, accurate and above all, patient-focused
June 6, 2024