Verified By Apollo Dermatologist June 7, 2024
16243కాలస్ అనేది పదేపదే రాపిడి, ఒత్తిడి మరియు చికాకు యొక్క ప్రతిస్పందన కారణంగా చర్మం యొక్క మందమైన పొరలుగా ఏర్పడే పరిస్థితి. కాలస్ సాధారణంగా పాదాలు మరియు చేతులపై కనిపిస్తాయి కానీ చర్మంపై ఎక్కడైనా కూడా సంభవించవచ్చు. కాలస్ కూడా అదే విధంగా సంభవించే కాయల(కార్న్‌ల) వంటివి.
వ్యక్తి ఏదైనా అసౌకర్యాన్ని అనుభవిస్తే మాత్రమే కార్న్స్ మరియు కాలస్‌లకు చికిత్స చేయవలసి ఉంటుంది, చాలా మంది వ్యక్తులు ఘర్షణ కలుగకుండా కాపాడుకోవడం ద్వారా వాటిని అదృశ్యం చేసుకుంటారు. అయితే, పాదాలకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల మధుమేహం లేదా మరేదైనా ఇతర పరిస్థితి ఉన్న రోగులు సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సరైన వైద్య సంరక్షణను కలిగి ఉండటం అత్యవసరం, సాధారణంగా ఇటువంటి పరిస్థితులు ఉన్న వ్యక్తులకు ఇది అవసరం.
కాలస్ మరియు కార్న్స్ మధ్య వ్యత్యాసం ఏమిటి?
కాలస్ | కార్న్స్ |
ఇది రాపిడి లేదా ఒత్తిడి కారణంగా మందంగా మారే చర్మంలో ఒక భాగం. | మృత చర్మంతో తయారైన ఒక రకమైన కాలస్‌ను కార్న్స్ అంటారు. |
ఇవి పసుపు లేదా లేత రంగులో ఉండి తాకడానికి ముద్దగా ఉంటాయి. | గట్టి కార్న్స్ చిన్నవిగా మరియు మందంగా ఉంటాయి, అయితే మృదువైన కార్న్స్ తెల్లగా ఉండి రబ్బరు ఆకృతిని కలిగి ఉంటాయి. |
కాలస్‌లు కార్న్స్ కంటే పెద్దవి మరియు వెడల్పుగా ఉంటాయని కనుగొనబడ్డాయి. | కార్న్స్ చిన్నవిగా మరియు గుండ్రంగా ఉంటాయి, అవి గట్టిగా లేదా మృదువుగా ఉండవచ్చు. |
కాలస్ యొక్క కారణాలు ఏమిటి?
ఒక నిర్దిష్ట చర్మ ప్రాంతంపై పదే పదే ఒత్తిడి మరియు రాపిడి పడటం కాలస్ మరియు కార్న్‌ల సంభవించడానికి మరియు పెరుగుదలకు ప్రధాన కారణం. రాపిడి మరియు ఒత్తిడిల సాధారణ మూలాలలో కొన్ని:
· చెప్పులు మరియు బూట్లు వేసుకున్నప్పుడు సాక్స్‌లను వేసుకోకపోవడం వలన మీ పాదాలతో పాదరక్షల రాపిడి పెరుగుతుంది, ముఖ్యంగా మీరు సరిగ్గా సరిపోని సాక్స్‌లను ధరించడం.
· చేతులపై కాలస్‌లు సాధారణంగా చేతి పరికరాలను ఉపయోగించడం, నిరంతర రచనలు మరియు సంగీత వాయిద్యాలను ప్లే చేయడం నుండి మరియు ఒకే భాగం పదేపదే ఒత్తిడికి గురికావడం వల్ల ఏర్పడతాయి.
· హైహీల్స్ మరియు బిగుతుగా ఉండే బూట్లు ధరించడం వల్ల మీ పాదాలపై ఒత్తిడి పడుతుంది. మీ పాదరక్షలు వదులుగా ఉన్నట్లయితే, దానిలోని ఏదైనా కుట్టు లేదా సీమ్ మీ పాదాలకు పదేపదే రాచుకుపోవచ్చు, ఇది కాలస్ లకు దారితీస్తుంది.
కాలస్ లక్షణాలు ఏమిటి?
కార్న్స్ మరియు కాలస్ వలన ఒక వ్యక్తికి రాళ్లపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. దీని సంకేతాలు మరియు లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి –
· గట్టిపడిన మరియు పెరిగిన గడ్డ.
· మైనపు, పొడిబారిన లేదా పొరలుగా ఉండే చర్మం.
· గట్టిగా ఉండే మరియు మందపాటి చర్మం ప్రాంతం.
· చర్మం కింద నొప్పి మరియు సున్నితత్వం.
కాలస్ నొప్పిగా మారినట్లయితే మరియు ఏదైనా ద్రవం కారుతుంటే, రోగి తక్షణమే వైద్య సలహా తీసుకోవాలి, ఎందుకంటే కాలస్ ప్రాంతంలో వ్యాధి సోకిందని అర్థం. అదనంగా, డయాబెటిస్, పెరిఫెరల్ న్యూరోపతి మరియు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి ఉన్న రోగులు కాలస్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.
రోగిలో కాలస్ ఎలా నిర్ధారణ అవుతుంది?
వైద్యుడు పాదాలను పరిశీలించి మందమైన చర్మానికి కారణమయ్యే పొక్కులు మరియు సిస్టులను సాధ్యమైన కారణాలుగా మినహాయిస్తాడు. భౌతిక అనాటమీ కార్న్ లేదా కాలస్ ఉన్నట్టు తేల్చితే ఎక్స్-రే అవసరం పడవచ్చు.
కాలస్‌తో సంబంధం ఉన్న ప్రమాద కారకాలు ఏమిటి?
కొన్ని కారకాలు ఇవి సంభవించే లేదా పునరావృతమయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి, వాటిలో:
· హామర్ టో – వంకరగా ఇది కాలి వెళ్ళు పంజాలా వంకీలు తిరిగి ఉండే ఒక వైకల్యత.
· బునియన్ – ఇది బొటని వేలు కీలు క్రింది భాగంలో ఎముక పైకి పొడుచుకు వచ్చి ఉండే వైకల్యత.
· పాదాల యొక్క ఇతర వైకల్యాలు – బోన్ స్పర్ వంటి పాదాల వైకల్యాలు మీ పాదరక్షల లోపలి చర్మం నిరంతరం రాచుకుపోవడం వల్ల కాలస్‌కు దారితీయవచ్చు.
· చేతులను రక్షించకపోవడం – సరైన రక్షణ కవచం లేకుండా చేతి పరికరాలు మరియు సాధనాలను ఉపయోగించడం వలన మీ చర్మం స్థిరమైన ఘర్షణ మరియు ఒత్తిడికి గురవుతుంది, ఇది కాలస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కాలస్ కోసం వైద్యుడిని ఎప్పుడు సందర్శించాలి?
వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే మరియు కాలస్ చాలా అసౌకర్యాన్ని ఇవ్వకపోతే, ఆ వ్యక్తికి నిపుణుల చికిత్స అవసరం లేదు. అయితే, పాదాల నిపుణుడి సలహా తీసుకోవడానికి కారణమయ్యే ఈ క్రింది వంటి అనేక పరిస్థితులు ఉన్నాయి:
· ఒక వ్యక్తికి మధుమేహం లేదా రోగనిరోధక శక్తి విహీనత కలిగించే నరాల ఆరోగ్యం మరియు బలహీనమైన ప్రసరణ ఏదైనా పరిస్థితి ఉంటే.
· సాధారణ కార్యకలాపాలు నిర్వహించడంలో నొప్పి మరియు ఇబ్బందిని అనుభవిస్తుంటే.
· కార్న్స్ మరియు కాలస్ చాలా తరచుగా సంభవిస్తుంటే.
అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి 1860-500-1066కు కాల్ చేయండి.
బాధాకరమైన లేదా సంక్రమణ సోకిన కాలస్ చికిత్సకు అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి?
కార్న్స్ మరియు కాలస్‌లకు సాధారణంగా సరైన-తగిన బూట్లు మరియు రక్షిత ప్యాడ్‌లను ధరించడం ద్వారా చికిత్స చేయవచ్చు. అయినప్పటికీ, పరిస్థితి కొనసాగితే, వైద్య చికిత్సలు ఉపశమనం కలిగిస్తాయి.
· అదనపు చర్మాన్ని కత్తిరించడం – నొప్పిని నివారించడానికి డాక్టర్ మందమైన చర్మాన్ని క్రిందికి లాగుతారు.
· కాలస్-తొలగించే మందులు – 40% సాలిసిలిక్ యాసిడ్ ప్యాచ్ అప్లై చేయవచ్చు. ప్యూమిస్ స్టోన్, నెయిల్ ఫైల్ వంటివి వైద్యులు సూచించే ఇతర పద్ధతులు.
· షూ ఇన్సర్ట్‌లు – రోగికి అంతర్లీనంగా పాదాల అసహజత ఉంటే, కార్న్స్ లేదా కాలస్ లను నివారించడానికి వైద్యుడు కస్టమ్-మేడ్ ప్యాడెడ్ షూ ఇన్సర్ట్‌లను సూచించవచ్చు.
· శస్త్ర చికిత్స – అరుదైన సందర్భాల్లో కాలస్ కు శస్త్రచికిత్సను డాక్టర్ సిఫారసు చేయవచ్చు.
జీవనశైలి మరియు ఇంటి నివారణలు
కొన్ని ఇంటి నివారణలు మరియు జీవనశైలి మార్పులు కాలస్ లేదా కార్న్‌ను నయం చేస్తాయి. కాలస్‌ను నివారించడానికి మరియు ఉపశమనం కోసం ఈ క్రింది వాటిని ప్రయత్నించవచ్చు:
· ప్రభావిత ప్రాంతంలో ఓవర్ ది కౌంటర్ లభించే ప్యాడ్‌లు లేదా లిక్విడ్ కార్న్ రిమూవర్‌లను ఉపయోగించండి.
· మీ పాదాలు మరియు చేతులను వెచ్చని మరియు సబ్బు నీటిలో నానబెట్టండి. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది, ఇది కాలస్ లేదా కార్న్‌ను తొలగించడాన్ని సులభతరం చేస్తుంది.
· మందమైన చర్మం యొక్క పొరను తొలగించడానికి వాష్‌క్లాత్, ఎమెరీ బోర్డ్, నెయిల్ ఫైల్ లేదా ప్యూమిస్ స్టోన్‌తో కాలస్ లేదా కార్న్ను రుద్దండి.
· చర్మం మృదువుగా ఉండాలంటే మాయిశ్చరైజర్‌ని పూయండి.
· ఏదైనా కార్న్ లేదా కాలస్ యొక్క సంభావ్యతను తగ్గించడానికి బాగా అమర్చబడిన, కుషన్డ్ మరియు సౌకర్యవంతమైన సాక్స్ మరియు షూలను ధరించండి.
కాలస్‌ను నివారించడానికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు ఏమిటి?
కొన్ని నివారణ చర్యలను అనుసరించడం వలన మీరు కార్న్స్ మరియు కాలిసస్ పెరుగుదలను నిరోధించవచ్చు.
· రాపిడికి గురయ్యే మీ చర్మం యొక్క ప్రాంతాలపై నాన్-మెడికేటెడ్ కార్న్ ప్యాడ్‌లు, బ్యాండేజీలు మరియు ఫీల్ ప్యాడ్‌లను ధరించండి. మీరు మీ కాలి మధ్య కొన్ని గొర్రె ఉన్ని లేదా కాలి సేపరేటర్ లను కూడా ఉపయోగించవచ్చు.
· షూ ధరించేటప్పుడు, మీరు తప్పనిసరిగా మీ కాలి వేళ్లను కదిలించగలగాలి. లేదా మీ పాదాలపై రాపిడి మరియు ఒత్తిడిని నివారించడానికి మీరు దానిని షూ దుకాణం నుండి సాగదీయవచ్చు.
· చేతి తొడుగులు ధరించండి లేదా వాటిని ఉపయోగిస్తున్నప్పుడు మీ టూల్ హ్యాండిల్స్‌ను కవర్లు లేదా క్లాత్ టేపులతో కప్పండి.
ముగింపు
చర్మంపై రాపిడి మరియు పీడనం వల్ల కాలస్ ఏర్పడుతుంది కాబట్టి, ఇది ఎప్పుడైనా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేలవంగా అమర్చిన బూట్లు నిరంతరం ధరించడం కార్న్స్ మరియు కాలస్ లకు ప్రధాన కారణం. చాలా కార్న్స్ మరియు కాలస్ లను ఇంట్లోనే నిర్వహించవచ్చు, అయితే వైద్యుడు పాదాలను పరిశీలించి, రోగి ఆందోళన చెందితే వాటికి చికిత్స చేయవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు)
కాలస్‌ను తొలగించాల్సిన అవసరం ఉందా?
కాలస్‌కు ప్రొఫెషనల్ చికిత్స అవసరం లేదు, కానీ అది భరించలేని నొప్పిని కలిగిస్తే, వైద్యుడు కాలస్‌ను తీసివేయమని సూచించవచ్చు. మోల్స్‌కిన్ ప్యాడ్‌లు మరియు ఇతర చికిత్సల వంటి రాపిడి మూలాన్ని తొలగించడం వల్ల కాలస్ దానంతట అదే తగ్గిపోతుంది.
కాలస్‌లు తిరిగి పెరుగుతాయా?
కాలస్ అనేది అధిక ఒత్తిడి మరియు రాపిడి నుండి చర్మాన్ని రక్షించే మార్గంగా సంభవించే ఒక పరిస్థితి. ఈ పరిస్థితులు కొనసాగితే, కాలస్ తిరిగి రావడం ఎప్పటికీ ఆగదు. కొన్ని చికిత్సల తర్వాత కూడా, చర్మం యొక్క జ్ఞాపకశక్తి కారణంగా కాలస్ తిరిగి రావచ్చు.
కాలస్ చర్మం మృత చర్మమా?
కాలస్ సాధారణంగా పసుపు, చదునైన మరియు ఎండిన చర్మం పొరగా ఏర్పడుతుంది, తరచుగా మృతి చెందుతుంది. ఇది నొప్పిని కలిగిస్తుంది మరియు సాధారణంగా జీవించడానికి సౌకర్యంగా ఉండదు.
The content is carefully chosen and thoughtfully organized and verified by our panel expert dermatologists who have years of experience in their field. We aim to spread awareness to all those individuals who are curious and would like to know more about their skin and beauty